Fuel Price Hike in India: ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారత్‌పై పరోక్ష ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీంతో భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. నిజానికి ఈపాటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగాల్సి ఉన్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం దానికి జోలికి పోవట్లేదనే వాదన వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు దాటింది. 2014 తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎన్నికలపై పడుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఇంధన ధరల జోలికి ప్రభుత్వం వెళ్లలేట్లదని అంటున్నారు.


వచ్చే వారంతో అసెంబ్లీ ఎన్నికలు ముగియనుండటంతో.. ఇక అప్పటినుంచి ప్రతీరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని జేపీ మోర్గాన్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.5.7 మేర నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు తిరిగి సాధారణ మార్జిన్‌కి రావాలంటే రూ.9 లేదా 10 శాతం మేర ధరలు పెంచాల్సి ఉంటుందన్నారు. 


ఒకవేళ ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇలాగే కొనసాగితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అది 140 డార్లకు చేరువగా వెళ్తే.. భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.200కి చేరవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్‌లో పదో వంతు రష్యానే ఉత్పత్తి చేస్తోంది. 2021 నుంచి భారత్ రష్యా నుంచి 43,400 బ్యారెల్స్ క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్‌కు రష్యా నుంచి రావాల్సిన సప్లైపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆవిధంగా చూసినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు.


Also Read: Russia Ukraine War: యుద్ధ కాలాన ఆపన్న హస్తం.. కీవ్‌లో ఉచిత షెల్టర్, ఆహారం అందిస్తోన్న ఇండియన్ రెస్టారెంట్ 


Also Read: Joe Biden confuse: జో బైడెన్​ స్పీచ్​లో తడబాటు.. జోకులు వేస్తున్న నెటిజన్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook