Joe Biden confuse: సాధారణంగా మాట్లాడేటప్పుడపు ఎవరైనా తడబాటు పడటం సాధారణంగా జరుగుతుంది. అయితే మీడియాతో మాట్లాడేటప్పుడు, కెమెరాలు చూస్తున్నప్పుడు ఎవరైనా మాటల్లో తడపడితే.. అది చర్చనీయాంశమవుతుంది.
అలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడికి ఎదురైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో జో బైడెన్ ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇందులో ఉక్రెనియన్ ప్రజలకు మద్ధతు కొనసాగుతుందని చెప్పిన బైడెన్.. రష్యాపై విమర్శలు గుప్పించారు.
అయితే తన ప్రసంగంలో ఓ సారి ఉక్రెయినియన్ ప్రజలకు బదులు.. ఇరానియన్ ప్రజలు అని తప్పుగా చెప్పారు బైడెన్.
బైడెన్ ఏమన్నారంటే..
'పుతిన్ (రష్యా అధ్యక్షుడు) యుద్ధ ట్యాంక్‌లతో కీవ్ నగరాన్ని ఆక్రమించొచ్చు కానీ.. ఆయన ఇరానియన్ ప్రజల మనసును గెలుచుకోలేరు.' అని చెప్పుకొచ్చారు బైడెన్. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యవేదికను ఏర్పాటు చేసేందుకు బైడెన్ భోవోద్వేగ ప్రసంగం చేయగా.. అందులో దొర్లిన ఓ పొరపాటు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
జో బైడెన్ తడబాటుకు సంబంధించి పలువురు ఆయనపై జోకులు వేస్తున్నారు. ఆయన ఏదైనా విషయం గురించి మాట్లాడేముందుకు ముందు కాస్త ప్రాక్టీస్ చేస్తే మంచిదంటూ సూచిస్తున్నారు.
It sounds like Biden thinks Kyiv is in Iran.
Which actually explains a lot. https://t.co/s0xM3IAXU3
— Avi Yemini (@OzraeliAvi) March 2, 2022
ఇదే తొలిసారి కాదు..
పేర్ల విషయంలో తడబాటుకు గురికావడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయన ఇలాంటి పొరపాట్లు చేశారు. గత ఏడాది కూడా ఇలానే ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను.. ప్రెసిడెంట్ కమలా హారిస్ అని త. అప్పట్లో కూడా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also read: Shocking Video: ఇదేందయ్యా ఇది.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట.. నేనెప్పుడూ చూడలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook