Petrol, Diesel Prices increased by over 80 paise after 137 days: సుదీర్ఘ విరామం తర్వాత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. 137 రోజుల  తర్వాత ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో లీటర్‌ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దాంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 109.10 కాగా.. డీజిల్‌ రూ. 95.40 పైసలకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి (మార్చి 22) నుంచి అమల్లోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో తెలుగు రాష్ట్రం ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగాయి. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.80లుగా ఉండగా.. డీజిల్ రూ. 96.83గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.21, డీజిల్ ధర రూ. 97.26గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.21, డీజిల్ ధ‌ర రూ. 87.47గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 110.82, డీజిల్ ధ‌ర రూ. 95.00గా ఉంది. కోల్‌క‌తాలో పెట్రోల్ రూ. 105.51, డీజిల్ రూ. 90.62లుగా ఉండగా.. చెన్నైలో పెట్రోల్ రూ. 102.16, డీజిల్ ధ‌ర రూ. 92.19గా నమోదైంది.



ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా భారత్‌లో చమురు ధరలు పెరిగాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో.. పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం అనివార్యం అయినట్టు సమాచారం. ఇక ఇప్పటినుంచి చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.


Also Read: Today Gold and Silver Price: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో తాజా బంగారం, వెండి రేట్లు ఇవే!!


Also Read: Today Horoscope March 22 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు