Today Horoscope March 22 2022: మేషం ( Aries): మనో ధైర్యంతో ముందడుగు వేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. కనకధార స్తోత్రం చదివితే బాగుంటుంది.
వృషభం (Taurus): ఆత్మ శుద్ధితో పనిచేసి విజయాలను అందుకుంటారు. నిర్ణయాలు మార్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
మిథునం (Gemini): ధర్మసిద్ది ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేస్తారు. ఆదిత్య హృదయం చదవాలి.
కర్కాటకం (Cancer): మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది.
సింహం (Leo): అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.
కన్య (Virgo): ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంతో సరదాగా ఉంటారు. శివారాధన చేస్తే మంచిది.
తుల (Libra): ఆత్మ విశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయు సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలి. వాదోపవాదాలు చేయకండి. వివాదాలకు దూరంగా ఉండాలి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.
వృశ్చికం (Scorpio): శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గిట్టని వారితో తక్కువగా మాట్లాడాలి. స్థాన చలనం ఉంది. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.
ధనస్సు (Sagittarius): ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు చేస్తారు. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.
మకరం (Capricorn): శుభ ఫలితాలు ఉన్నాయి. బంధు, మిత్రులను కలుస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈశ్వరారాధన శుభప్రదం.
కుంభం (Aquarius): ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు ఉన్నాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. శని శ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
మీనం (Pisces): అన్ని పనుల్లో శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.
Also Read: Pegasus Spyware: పెగాసస్ వ్యవహారం టీడీపీ మెడకు చుట్టుకోనుందా..హౌస్ కమిటీ ఏర్పాటు
Also Read: LIC Public Issue: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ విడుదల మరింత ఆలస్యం, మరోసారి దరఖాస్తు చేసుకున్న ఎల్ఐసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook