Petrol Price Hike Today: పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆదివారం కూడా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను (Fuel price hiked) పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలకు అనుగుణంగానే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే జీవన కాల గరిష్ఠం వద్ద కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరో రికార్డు స్థాయికి చేరాయి.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ధరలు ఇలా..


హైదరాబాద్​లో పెట్రోల్ (Petrol price in Hyderabad) ధర లీటర్​ 41 పైసలు పెరిగి.. రూ.114.09 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) 42 పైసలు పెరిగి.. రూ.107.37 వద్ద ఉంది.


విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్​, డీజిల్ ధరలు 38, 39 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర (Petrol price in Vizag) రూ.114.76 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.107.45 వద్ద ఉన్నాయి.


ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..


దేశ రాజధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol Price in Delhi) 37 పైసలు, డీజిల్ ధర లీటర్​ 36 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్, డీజిల్ (Diesel Price in Delhi) ధరలు లీటర్​కు వరుసగా.. రూ.109.71, రూ.98.44 వద్ద ఉన్నాయి.


చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chenni) లీటర్​ 32 పైసలు పెరిగి.. రూ.106.33 వద్ద ఉంది. లీటర్ డీజిల్ (Diesel Price in Chenni) ధర 35 పైసలు పెరిగి.. రూ.102.57 వద్దకు చేరింది.


బెంగళూరులో పెట్రోల్ ధర (Petrol Price in Bengaluru) లీటర్​ 41 పైసలు పెరిగి రూ.113.52 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 42 పైసలు పెరిగి (Diesel Price in Bengaluru) రూ.104.47 వద్దకు చేరింది.


దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్​ 36 పైసలు పెరిగి (Petrol Price in Mumbai) రూ.115.47కి చేరింది. లీటర్ డీజిల్ ధర 39 పైసలు పెరిగి రూ.106.59 వద్ద (Diesel Price in Mumbai) కొనసాగుతోంది.


కోల్​కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్​కు.. 37 పైసలు, 38 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ (Petrol Price in Kolkata) పెట్రోల్ ధర రూ.110.12 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​ (Diesel Price in Kolkata) రూ.101.53 వద్ద కొనసాగుతోంది.  


Also Read: Excise Collection Surges: 33 శాతం పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం.. కరోనా సంక్షోభానికి ముందుతో పోలిస్తే 79 శాతం అధికం  


Also Read: Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌.. త్వరపడండి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి