Excise Collection Surges: 33 శాతం పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం.. కరోనా సంక్షోభానికి ముందుతో పోలిస్తే 79 శాతం అధికం

Excise Collection Surges: పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా ఈ ఏడాది ప్రథమార్ధంలో రూ.1.71 కోట్లు ప్రభుత్వ నిధికి జమ అయ్యాయి. కరోనాకు ముందు పరిస్థితులతో పోలిస్తే ఇది 79 శాతం వృద్ధి చెందడం విశేషం. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) వద్ద ఉన్న ఏప్రిల్‌ - సెప్టెంబరు గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 05:28 PM IST
Excise Collection Surges: 33 శాతం పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం.. కరోనా సంక్షోభానికి ముందుతో పోలిస్తే 79 శాతం అధికం

Excise Collection Surges: దేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా వచ్చే వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 33 శాతం పెరిగాయి. కొవిడ్‌ సంక్షోభానికి ముందు పరిస్థితులతో పోలిస్తే 79 శాతం వృద్ధి సాధించడం విశేషం. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) వద్ద ఉన్న ఏప్రిల్‌ - సెప్టెంబరు గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

గతేడాది తొలి అర్ధభాగంలో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు.. ఈసారి రూ.1.71 లక్షల కోట్లకు ఎగబాకాయి. కరోనా వెలుగులోకి రావడానికి ముందు 2019, ఏప్రిల్‌ - సెప్టెంబరు మధ్య ఇవి రూ.95,930 కోట్లుగా ఉన్నాయి. అప్పటితో పోలిస్తే 79 శాతం పెరుగుదల నమోదైంది. ఎక్సైజ్‌ సుంకం భారీగా పెరగడమే ఇందుకు కారణం. ఎక్సైజ్‌ సుంకం ద్వారా 2020 - 21లో రూ.3.89 లక్షల కోట్లు, 2019-20లో రూ.2.39 లక్షల కోట్లు వసూలయ్యాయి.

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌, సహజవాయువు పైన మాత్రమే ఎక్సైజ్‌ సుంకం విధిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో అదనంగా రూ.42,931 కోట్లు వసూలయ్యాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఏడాది మొత్తంలో ఆయిల్‌బాండ్లకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లతో పోలిస్తే ఇది నాలుగింతలు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండడంతో ఇంధన గిరాకీ పెరుగుతోంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకం ద్వారా వస్తున్న ఆదాయం సైతం అదే స్థాయిలో పెరుగుతోంది.

Also Read: JioPhone Next: జియోఫోన్ నెక్ట్స్​ గురించి బిగ్ అప్​డేట్​- ధర, ఫీచర్ల వివరాలు వెల్లడి  

Also Read: EPF interest: ఈపీఎఫ్​ఓ చందాదారులకు గుడ్​ న్యూస్​- త్వరలోనే ఖాతాల్లో వడ్డీ జమ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News