Petrol Price in Hyderabad 14th June 2021: ఓవైపు కరోనా మహమ్మారి పీడిస్తుంటే, మరోవైపు ఇంధన ధరలు మండిపోతున్నాయి. వాహనదారులకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కు చేరుకోవడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం లీటర్ పెట్రోల్ ధర రూ.96.40కి చేరగా, డీజిల్ ధర రూ.87.28 అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.102.58 కాగా, డీజిల్ ధర రూ.94.70 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.59, డీజిల్ ధర రూ.95.91కు చేరింది.


Also Read: EPFO Alert: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్‌ నగదు సాయం


హైదరాబాద్‌లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. భాగ్యనగర వాసులు పెట్రోల్ ధరలు భరించలేక లబోదిబోమంటుతున్నారు. తాజాగా 30 పైసలు పెరగడంతో 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20కు చేరింది.  మరోవైపు 32 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.95.14 అయింది. ఏపీలో విజయవాడలో పెట్రోల్ ధర రూ.102.79, డీజిల్ ధర రూ.96.99గా ఉన్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook