Petrol Price in Hyderabad 5th July 2021: ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ లీటర్‌పై 35 పైసలు చొప్పున పెరిగింది. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారుల బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. డీజిల్ ధరలు సైతం పెట్రోల్ ధరలతో పోటీపడి పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు మేర పెరిగింది. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ ధర 35 పర్యాయాలు పెరగగా, డీజిల్ 34 పర్యాయాలు ధర పెరగడం గమనార్హం. నేడు దేశ రాజధాని ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ దర రూ.99.86కు చేరుకోగా, డీజిల్ ధర రూ.89.36 వద్ద నిన్నటి ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధర 37 పైసల మేర పెరిగింది. హైదరాబాద్‌ (Petrol Rate in Hyderabad)లో జులై 5న లీటర్ పెట్రోల్ ధర రూ.103.78కు చేరగా, డీజిల్ నిన్నటి ధర రూ.97.40గా ఉంది. హైదరాబాద్ కంటే జిల్లాలలో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పెట్రోల్ ధర రూ. 105.80, డీజిల్ ధర రూ.105.37గా ఉన్నాయి.


Also Read: Samsung Galaxy F22 Price: జులై 6న విడుదలకు సిద్ధంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22, ఫీచర్లు ఇవే


ఏపీలో తగ్గిన ధరలు
ఏపీలోనూ గత నెలలోనే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటగా, నేడు పెట్రోల్ ధర 11 పైసల చొప్పున తగ్గింది. తాజాగా విజయవాడ (Vijayawada)లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.26 కాగా, ఒక లీటర్ డీజిల్ ధర 45 పైసలు చొప్పున దిగొచ్చింది. విజయవాడలో రూ.99.27 వద్ద లీటర్ డీజిల్ విక్రయిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.105.92కి చేరగా, డీజిల్ ధర రూ.96.91 అయింది. 


Also Read: LPG Cylinder Price: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు, ఆయా నగరాలలో లేటెస్ట్ ధరలు ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook