PF balance transfer: చాలా మంది ఉద్యోగాలు మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్  (పీఎఫ్​) ఖాతాను మార్చుకోవడం మరిచిపోతుంటారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఆందోళన చెందుతుంటారు. అప్పుడు ఏం చేయాలో అర్థమవక ఈపీఎఫ్​ ఆఫీసుకు పరుగు పెడుతుంటారు. అందులో ఉన్న బ్యాలెన్స్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అలాంటి సమస్య మీకూ వస్తే.. కాంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే. మీ పాత పీఎఫ్​ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్​ మొత్తాన్ని కొత్త ఖాతాలోకి ట్రాన్స్​ఫర్ (PF Fund Transfer from Old account to new one) చేసుకోవచ్చు. అది కూడా పీఎఫ్ ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లో కూర్చునే.


పీఎఫ్ బ్యాలెన్స్​ బదిలీ ప్రక్రియ..


ఫాత పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్​ను ట్రాన్స్​ఫర్​ చేసుకునేందుకు మీకు.. యాక్టివ్​ యూఏఎన్​ నంబర్​, పాస్​వర్డ్​ అవరసరం అవుతాయి. పాత అకౌంట్​తో లింక్​ అయిన బ్యాంక్ ఖాతా, ఆధార్​ నంబర్, ఫోన్​ నంబర్స్​ కూడా ఉండాలి.


  1. ముందుగా ఈపీఎఫ్​ఓ అధికారిక మెంబర్స్​ పోర్టల్​లోకి వెళ్లాలి

  2. అందులో మీ యూఏఎన్​, పాస్​వర్డ్​తో లాగిన్ అవ్వాలి

  3. మెంబర్స్​ పోర్ట్ ఫోలియో ఆప్షన్​ను ఎంచుకోవాలి. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలు, పేరు, ఆధార్ సంఖ్య, ప్యాన్​ కార్డ్ నంబర్​ వంటివి చెక్ చేసుకోవాలి.

  4. ఒకవేళ మీ పాస్‌బుక్ వివరాలు చెక్ చేసుకోవాలనుకుంటే Passbook కోసం మరోసారి లాగిన్ అవ్వాలి. మీ ఈపీఎఫ్ ఖాతాలో నగదు వివరాలు చెక్ చేసుకోవాలి.

  5. Online Services ఆప్షన్‌కు వెళ్లి అందులో One Member - One EPF Account మీద క్లిక్ చేయాలి. ఆపై Get details ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పాత కంపెనీలో మీ పీఎఫ్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. 

  6. మారు జాబ్ మానేసిన కంపెనీ డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ను అప్‌డేట్ చేసి ఉండాలి. లేదంటే జాబ్ మానేసిన రెండు నెలల తరువాత మీరే ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

  7. గతంలో పనిచేసిన కంపెనీల వివరాలు కనిపించిన తరువాత, మీ యూఏఎన్ వివరాలు నమోదు చేయాలి. ఆపై మీరు ఏ ఆఫీసు పీఎఫ్ ఖాతా నుంచి నగదు బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి. Get OTP మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి, ఆపై సబ్మిట్ చేస్తే PF Transfer ప్రక్రియ పూర్తవుతుంది.

  8. వారం నుంచి 10 రోజులలో మీ పీఎఫ్ పాస్‌బుక్‌లో బదిలీ అయిన పీఎఫ్ నగదు వివరాలు కనిపిస్తాయి. 

  9. ట్రాన్స్​ఫర్​ క్లెయిమ్​కు సంబంధించిన వివరాలతో మీ రిజిస్టర్​ మొబైల్​ నంబర్​కు ఓ మెసేజ్​ వస్తుంది. బదిలీ పూర్తయిన వివరాలను, బ్యాలెన్స్​ను నేరుగా ఈపీఎఫ్​ పోర్టల్​లో చూసుకోవచ్చు.


Also read: Gold Price today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు


Also read: SBI: ఎస్​బీఐ రుణాలు మరింత భారం- బేస్​ రేటు 10 బేసిస్​ పాయింట్లు పెంపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook