ATM With Draw Rules: ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు తీస్తే..173 రూపాయలు కట్
ATM With Draw Rules: ఏటీఎం నగదు విత్‌డ్రాయల్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అందుకే ఏటీఎం విత్‌డ్రాయల్స్ నిబంధనలు తెలుసుకుంటే మంచిది. లేకపోతే జేబు గుల్లవడం ఖాయం.
ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసేవారికి కీలకమైన అప్‌డేట్ ఇది. ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఇక ఏటీఎం నుంచి ఆ పరిమితికి మించి డబ్బులు విత్‌డ్రా చేస్తే భారీగా డబ్బులు కట్ అవుతాయి. మీ జేబులు గుల్లవుతాయి.
డిజిటల్ లావాదేవీలు పెరిగిన తరువాత ఏటీఎం విత్‌డ్రాయల్స్ చాలావరకూ తగ్గాయి. అయినా ఇప్పటికీ ఏటీఎం విత్‌డ్రాయల్ తప్పడం లేదు. అదే సమయంలో ఏటీఎం మెషీన్ల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు కొన్ని విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఇక నుంచి ఏటీఎం మెషీన్లలో 4 కంటే ఎక్కువసార్లు డబ్బులు విత్ డ్రా చేస్తే భారీగా డబ్బులు కట్ అవుతాయి.
ఏటీఎం నుంచి 4 కంటే ఎక్కువసార్లు డబ్బులు విత్‌డ్రా చేస్తే డబ్బులు కట్ అవుతాయనే విషయంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ జరిపిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ బ్యాంకు అయినా నెలకు 5సార్లు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఏటీఎం నుంచి 4 కంటే ఎక్కువసార్లు డబ్బులు తీస్తే..150 రూపాయలు ట్యాక్స్ 23 రూపాయలు మొత్తం 173 రూపాయలు కట్ అవుతాయి.
అయితే ఇదంతా ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ప్రతి బ్యాంకు ఏటీఎం నుంచి నెలకు 5 సార్లు లావాదేవీలకు అనుమతిస్తుంది. ఆ తరువాత ప్రతి లావాదేవీపై అత్యధికంగా 21 రూపాయలు కట్ అవుతాయి.
Also read: Share Market: లక్ష రూపాయలు 7 కోట్లుగా మారితే ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook