Post Office Scheme: పోస్టాఫీసులో స్కీముల్లో డబ్బులు దాచుకుంటున్నారా.. అయితే ఈ 3 స్కీముల రూల్స్ మారిపోయాయి.. తెలుసుకోకపోతే నష్టం తప్పదు
Post Office Scheme: ఈ దీపావళి పర్వదినం సందర్భంగా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా తెరుస్తున్నారా? ఈ కేంద్ర ప్రభుత్వ స్కీములో పెట్టుబడి ప్రారంభించే ముందే ఇటీవలే మారిన మూడు నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ఛాన్స్ ఉంది. ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
Post Office Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పోస్టాఫీసు అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది అత్యంత ప్రజాదరణ పొందుతున్న రిస్క్ లేని పొదుపు పథకాల్లో ఒకటి. ఈ దీపావళి 2024 పండగ సందర్భంగా మీ ఆర్థిక భవిష్యత్తును భద్రపరుచుకునే ప్రణాళికలో భాగంగా ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా తీసుకోవాలని భావిస్తున్నారా. మీరు పోస్టాఫీసులో ఈ అకౌంట్ తెరిచే ముందే తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ మధ్యే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ స్కీంను సంబంధించి మూడు కీలక మార్పులు జరిగాయి.
ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పిల్లాడి పేరుపై ఒక పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ అకౌంట్ తెరిచేందుకు ఛాన్స్ ఉంటుంది. ఒకటికి మించి ఖాతా ఉంటే అది సేవింగ్స్ ఖాతాగా మారుతుంది. దీంతో వడ్డీ రేటు పొదుపు అకౌంట్ కు వచ్చే విధంగా 4శాతం లోపే ఉంటుంది. దీంతో ప్రస్తుతం పీపీఎఫ్ పై వస్తున్న వడ్డీ 7.10 శాతంతో పోలిస్తే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐలు అకౌంట్ తీసుకోవడం గురించి కొత్త నిబంధనలను వచ్చాయి. ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2024 నుంచే అమల్లోకి వచ్చాయి.
చిన్నపిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతా తెరిచినట్లయితే వారికి 18ఏండ్ల వయస్సు వచ్చే వరకు పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు వర్తిస్తుంది. 18 ఏళ్ల వయస్సు దాటితే మేజర్లు అయ్యాకే పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతం వర్తిస్తుంది. ఒకటికి మించి పీపీఎఫ్ అకౌంట్స్ ఉంటే ప్రైమరీ అకౌంట్ కు మాత్రమే పీపీఎఫ్ స్కీమ్ వడ్డీ రేటు 7.10 శాతం వస్తుంది. మిగిలిన సెకండరీ అకౌంట్స్ ఆయా అకౌంట్లో ఉండే నగదు నిల్వలపై ఎలాంటి వడ్డీ రాదు. దీంత చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఒకటికి మించి అకౌంట్స్ ఉంటే వారు ఒకే ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సి వస్తుంది.
Also Read: Business Ideas: మీరు కుగ్రామంలో ఉన్నా పర్లేదు..ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష సంపాదించడం పక్కా
నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పోస్టాఫీసులో పీపీఎఫ్ అకౌంట్ తెరిస్తే..అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు తమ రెసిడెన్సీ స్టేటస్ వెల్లడించకపోయినట్లయితే వారి ఖాతా ఫ్రీజ్ అవుతుంది. సెప్టెంబర్ 30,2024 వరకు సెకండరీ పీపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ పై సేవింగ్స్ అకౌంట్ వడ్డీ వర్తించేది. ఇప్పుడు దాన్ని జీరోగా మార్చేశారు. ఎలాంటి వడ్డీ జనరేట్ కాదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.