PM Kisan 14th Installment: రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే 14వ విడత PM కిసాన్ యోజన..
PM Kisan 14th Installment: 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆర్థిక సహాయం పొందిన వారు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటేనే 14వ విడత ఆర్థిక సహాయం పొందుతారు. లేకపోతే ఎలాంటి సహాయం పొందలేరు.
PM Kisan 14th Installment: భారత్‌లో ప్రతి రైతుకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమలు చేసిన సంగతి తెలిసిందే..ఈ పథకం కింద ఇప్పటికీ లక్షలాది మంది రైతులు 13వ విడత వరకు లబ్ధి పొందారు. అయితే కేంద్ర త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన 14వ విడతను విడుదల చేయబోతోంది. ఈ విడతకు సంబంధించిన ఆర్థిక సహాయం మే 26 నుంచి 31 లోపు విడుదల చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. చివరి 13వ విడత ఫిబ్రవరి నెలలో విడుదల కాగా మే నెలాఖరులోగా ఈ విడత ఆర్థిక సాయం రైతులకు లభించనుంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం కేంద్ర ఇంకా వివరించలేదు.
2019 సంవత్సరం ఫిబ్రవరి 24లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద దేశంలోని అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ. 6,000 ఆర్థిక సాహాయం అందజేస్తోంది. అయితే ఈ ఆర్థిక సహాయం మూడు వాయిదాల్లో రూ. 2,000 చొప్పున కానుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
E-KYC తప్పనిసరి:
మీరు ఇంతక ముందు PM కిసాన్ యోజన పథకాన్ని పొంది ఉంటే.. 14వ విడత ఈ పథకాన్ని పొందడానికి తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ e-KYC చేసుకోలేకపోతే ఆలస్యం చేయకుండా ఈ రోజే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కేవైసీ చేసుకుంటే సులభంగా మీరు ఈ విడత ఆర్థిక సహాయం పొందొచ్చు. దీని కోసంం మీరు PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు OTP పొందుతారు. దీనిని ఆ వెబ్‌సైట్‌లో సబ్మిట్ చేసుకోవాలి. అంతే సులభంగా మీరు e-KYCని పొందుతారు. అంతేకాకుండా మీ సమీప CSC కేంద్రాన్ని సందర్శించి కూడా సులభంగా e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
భూమి రిజిస్టర్ కూడా తప్పనిసరి:
పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుడు 14వ విడత ప్రయోజనం పొందడానికి తప్పకుండా మీ పేరుపై భూమి రిజిస్టర్ తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అధికారిక వెబ్ పోర్టల్‌లో మీ భూమికి సంబంధించిన వివరాలతో పాటు మీ పేరుపై రిజిస్టర్ చేసి ఉంటేనే మీరు పీఎం కిసాన్ యోజనకు లబ్ధిదారుడుగా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి