PM Kisan 202314th Installment Release Date And Time Details : ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్నదాతలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. 13వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. 8 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.16,800 కోట్ల జమ చేసింది. 14వ విడత నిధులు మే చివరినాటికి రైతుల ఖాతాలో జమ అవుతాయని ముందుగా ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాలతో ఆలస్యం అవుతోంది. అయితే తాజాగా మరో డేట్ తెరపైకి వచ్చింది. జూన్ 23వ తేదీన పీఎం నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ డబ్బులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రూ.6 వేలను అందజేస్తోంది. రూ.2 వేల చొప్పున ఏడాదికి మూడు వాయిదాల్లో నేరుడగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 13 విడుతల్లో నగదు అందజేసింది. ఈ ఏడాది మొదటి విడత డబ్బులు ఫిబ్రవరిలో వచ్చాయి. 14వ విడత డబ్బులు (ఈ ఏడాది రెండోది) జూన్ 23న రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ బిజీగా ఉన్నందున జూన్‌ నెలలోనే డబ్బులు విడుదలయ్యే ఛాన్స్ ఉందంటున్నాయి. 


మీరు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకన్నట్లయితే.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి. ఆ తరువాత e-KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల లిస్టులో పేరు ఉండి.. ఈకేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు రావని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  


Also Read: Aadhaar Card Update: జూన్ 14వ వరకు ఫ్రీ సర్వీస్.. ఆధార్‌ను ఇలా అప్‌డేట్ చేసుకోండి


లబ్ధిదారుల లిస్ట్‌ను ఇలా చెక్ చేసుకోండి
==> ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
==> ఇక్కడ 'మాజీ కార్నర్' కింద 'బెనిఫిషియరీ లిస్ట్'పై క్లిక్ చేయండి 
==> రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం ఎంచుకోండి.
==> లిస్ట్‌ను పొందడానికి ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
==> జాబితాలో మీరు ఉందో లేదో చెక్ చేసుకోండి.


ఈకేవైసీని ఇలా పూర్తి చేసుకోండి
==> పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
==> రైట్ సైడ్‌లో ఉన్న ఈకేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి 
==> ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయండి
==> ఆ తరువాత సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
==> అనంతరం ఓటీపీ కోసం క్లిక్ చేయండి
==> మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. 
==> మీ ఈకేవైసీ కంప్లీట్ అయినట్లు మీకు సమాచారం వస్తుంది. 


Also Read: BGMI Returns: పబ్జీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. BGMI వచ్చేసింది.. కండీషన్స్ అప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook