Battlegrounds Game Now Available in India: పబ్జీ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI) ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చేసింది. BGMI గేమ్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆడుకోవచ్చు. దీని డెవలపర్ క్రాఫ్టన్ గేమ్ కోసం 2.5 అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది.
BGMI పాత వర్షన్‌కు.. ఇప్పుడు రిలీజ్ చేసిన వర్షన్‌కు కొంచెం భిన్నంగా ఉంది. ఈ గేమ్ భారత్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త కండీషన్లతో అందుబాటులోకి వచ్చింది.
18 ఏళ్లలోపు పిల్లలకు గేమ్ ఆడేందుకు పరిమిత సమయం నిర్ణయించారు. ఈ టైమ్ దాటిన తరువాత పిల్లలు BGMI గేమ్‌ను ఆడలేరు. బాధ్యతాయుతమైన గేమింగ్ ప్రాక్టీస్‌లను ప్రోత్సహించడానికి 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్లేటైమ్ మూడు గంటలు ఉంటుందని క్రాఫ్టన్స్ చెబుతోంది. మిగిలిన వారికి ప్లేటైమ్ రోజుకు ఆరు గంటలు ఉంటుందని వెల్లడించింది. మైనర్ల గేమ్ ఆడాలంటే తల్లిదండ్రుల ధృవీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
BGMI గేమ్‌ను Google Play Store నుంచి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్ ప్రస్తుతం Apple యాప్ స్టోర్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు. iPhone వినియోగదారులకు నేటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Apple App Storeలో కూడా అందుబాటులో తీసుకువచ్చే ప్రయత్నాలు జరగుతున్నాయి. డౌన్‌లోడ్ చేసిన వెంటనే వినియోగదారులందరూ గేమ్‌ను ఆడలేరు. గేమ్ ఆడేందుకు 48 గంటలు వేచి ఉండాల్సి రావచ్చు.
కొత్త మ్యాప్‌లు BGMIకి జోడించారు. ఇది గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది జిప్‌లైన్‌ల వంటి కొత్త సాధనాలను కూడా పరిచయం చేసింది. వీటిని ప్లేయర్‌లు ద్వీపం అంతటా వేగంగా ప్రయాణించడానికి ఉపయోగించవచ్చు. మీరు "న్యూ సిటీ" హోటళ్లలో ఎలివేటర్లను కూడా గేమ్‌లో కనుగొనవచ్చు. అంతేకాకుండా గేమ్‌లో కొత్త ఆయుధాలు, కొత్త వాహనాలు కూడా యాడ్ చేశారు.
Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook