Petrol Diesel Price Update: వాహనదారులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గింపు..!
Petrol Diesel Price Cut: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఎట్టకేలకు వాహనదారులకు ఉపశమనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.8 నుంచి రూ.10 తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమవ్వగా.. పీఎం మోదీ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Petrol Diesel Price Cut: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.10 వరకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఆమోదం కోసం లీటరుకు రూ.8 నుంచి రూ.10 వరకు తగ్గింపును కలుపుతూ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సంవత్సరం ముగింపులోపు కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పటికే గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన మోదీ సర్కారు.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై తీపి కబురు అందించనుంది.
గతేడాది ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంధనం ప్రీ-రిఫైనరీ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు అయిన ఇండియన్ ఆయిల్ కార్ప్ (IOC), భారత్ పెట్రోలియం కార్ప్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) ముడి చమురు తక్కువ ధరల కారణంగా భారీ లాభాలను ఆర్జించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో IOC, BPCL, HPCLలు సంయుక్తంగా 58,198 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో వాహనదారులకు ఊపశమనం కలిగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి రెడీగా ఉండగా.. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు చమురు కంపెనీలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అయితే అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో చమురు ధరలు రోజురోజుకు నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ చమురు కంపెనీలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 78.71 డాలర్లకు చేరుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96.72 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో రూ.109.66, విశాఖపట్నంలో రూ.110.48, రాజస్థాన్‌లో 109.34, హర్యానాలో 97.31, యూపీలో 97.05, పంజాబ్‌లో 98.45 రూపాయలుగా ఉంది. డీజిల్ విషయానికి వస్తే ఢిల్లీలో లీటరుకు రూ.89.62, హైదరాబాద్‌లో97.82, విశాఖపట్నంలో 98.27, యూపీలో 90.16, పంజాబ్‌లో 88.57, హర్యానాలో లీటరుకు 90.16 రూపాయలుగా ఉంది.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter