POCO M3 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం3 5జి ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌లో లభిస్తుంది. పరిమితమైన స్టాక్ అద్భుతమైన ఆఫర్లతో కేవలం ఆరు వందలు లేదా అంతకంటే తక్కువకే లభించనుంది. ఆశ్చర్యంగా ఉందా..వివరాలు చదవండి మరి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో పోకో ఒకటి. ఇప్పుడు పోకో ఎం3 ప్రో 5జి వెర్షన్ మోడల్‌పై ఫ్లిప్‌కార్డ్ మంచి ఆఫర్ అందిస్తుంది. అది కూడా పరిమితంగానే. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ఆఫర్ ఫిబ్రవరి 28వ తేదీ వరకే అందుబాటులో ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రోసెసర్ కలిగిన పోకో ఎం3 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పనితీరు కలిగి ఉంది. 3డి కర్వ్  స్విచ్చెబుల్ డిజైన్‌తో ఎల్లో కలర్‌లో లభిస్తుంది. 48 మెగాపిక్సెల్ ట్రిబుల్ కెమేరా అద్భుతమైన ఫోటోలు తీసేందుకు ఉపయోగపడుతుంది.


ఈ స్మార్ట్‌ఫోన్ 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌పై ఏడాది వారంటీ కూడా ఉంది. ఇందులో ఉన్న 128 జీబీ స్టోరేజ్‌ను 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ కావడంతో ఒకసారి ఛార్జ్ చేసిన తరువాత 4-5 రోజులు వెనక్కి చూసుకోవల్సిన అవసరం లేదు. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉండటంతో వీడియోలు చూడటంలో మంచి అనుభూతి కలుగుతుంది. 


పోకో ఎం3 ప్రో 5జి స్మార్ట్‌పోన్‌పై ఉన్న ఆఫర్ 


వాస్తవానికి ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ధర 17 వేల 999 రూపాయలుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్‌లో 15 వేల 499 రూపాయలకే లభించనుంది. ఒకవేళ మీరు మీ పాత ఫోన్‌తో ఎక్చ్సేంజ్‌లో తీసుకుంటే..మరో 14 వేల 8 వందల రూపాయలు నేరుగా తగ్గుతుంది. అంటే పోకో స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 699 రూపాయలకే లభిస్తుంది. ఇక ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై తీసుకుంటే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 17 వేల 999 రూపాయలున్న ఈ స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 630 రూపాయలకే లభిస్తుంది. యూపీఐ ద్వారా చెల్లింపు చేస్తే అదనంగా మరి కొంత క్యాష్‌బ్యాక్ రావచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ అనేది బ్యాంకును బట్టి అప్పటికప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఆటోమేటిక్‌గా నిర్ణయిస్తుంది. అంటే 18 వేల ఖరీదైన స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 630 రూపాయలు లేదా అంతకంటే తక్కువకే లభించవచ్చు. ఇంతకంటే తక్కువకు మార్కెట్‌లో అద్భుతమైన 6జీబి ర్యామ్ 48 మెగాపిక్సెల్ ఫోన్ లభిస్తుందా. అందుకే త్వరపడండి.త్వరపడండి. ఆఫర్ మరో మూడ్రోజులు మాత్రమే ఉంటుంది. 


Also read: Electron Bot Malware: ఇదో డేంజరస్ మాల్వేర్.. మీ సోషల్ మీడియా ఎకౌంట్స్‌ని ఆటాడిస్తుంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook