Portable AC with less than Rs.2000: ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తోంది. మండే ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఒక్క నిమిషం పాటు కరెంట్ పోయినా చెమటతో తడిచిపోయే పరిస్థితి. మధ్యాహ్నం పూట అయితే ఇంటి నుంచి కాలు బయటపెట్టేందుకు జనం జంకుతున్నారు. ఇళ్లల్లో కూలర్లు, ఏసీలతో సేద తీరుతున్నారు. ఒకవేళ మండే ఎండల్లో బయట తిరగాల్సి వచ్చినా... ఎక్కడికైనా వెంట తీసుకెళ్లే ఏసీలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కేవలం పవర్ బ్యాంక్ సైజులో అతి చౌక ధరలో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఏసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 నిమిషాల్లోనే ఎంతో చల్లదనం :


ఉబెర్‌స్వీట్ ఇంపోర్టెట్ మినీ ఎయిర్ కండిషనర్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీన్ని మినీ ఎయిర్ కండిషనర్ లేదా పర్సనల్ ఎయిర్ కండిషనర్ అని పిలుస్తారు. కేవలం పవర్ బ్యాంక్ సైజులో ఉండే దీన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఎంతో చల్లదనాన్ని అందిస్తుంది. ఇంట్లో మీరు పని చేసే గదిలో లేదా ప్రయాణాల్లో ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది.


కేవలం రూ.1949కే అందుబాటులో :


ఉబెర్‌స్వీట్ పోర్టబుల్ మినీ ఎయిర్ కండిషనర్ ప్రారంభ ధర రూ.3524. అయితే అమెజాన్‌లో 45 శాతం వరకు డిస్కౌంట్‌తో కేవలం రూ.1949కే దీన్ని మీరు కొనుగోలు చేయవచ్చు. యూఎస్‌బీ కేబుల్ సాయంతో దీన్ని మీరు మీ ల్యాప్‌టాప్‌తో కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీకి ఒక స్టాండ్ కూడా వస్తుంది. దాని సాయంతో ఎక్కడైనా సులువుగా అమర్చవచ్చు. 


Also Read: Samantha Tattoos: సమంత ఒంటిపై ఆ మూడు టాటూలు ఎక్కడ..టాటూలు ఎందుకు వద్దంటోంది


Vishwa Deenadayalan: విషాదం... యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీనదయాళన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook