Vishwa Deenadayalan Death: యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీన దయాళన్ (18) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తమిళనాడుకు చెందిన విశ్వ దీన దయాళన్ మేఘాలయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నేషనల్ అండ్ ఇంటర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అస్సాంలోని గౌహతి నుంచి మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్తుండగా దీనదయాళ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన ఓ భారీ ట్రక్కు అదుపు తప్పి దీనదయాళ్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఈ వివరాలు వెల్లడించింది.
ప్రమాద సమయంలో దీన దయాళ్‌తో పాటు కారులో మరో ముగ్గురు టీమ్ మేట్స్ ఉన్నారు. ఆ ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ఆ ముగ్గురు రమేశ్ సంతోష్ కుమార్, అవినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్, కిశోర్ కుమార్‌లుగా టీటీఎఫ్ఐ తెలిపింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా... విశ్వను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పేర్కొంది.
ఇప్పటివరకూ విశ్వ పలు జాతీయ, అంతర్జాతీయ మెడల్స్ సాధించాడు. టేబుల్ టెన్నిస్ రంగంలో విశేషంగా రాణిస్తున్న విశ్వ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలామందిని షాక్‌కి గురిచేసింది. విశ్వ మృతి పట్లు మేఘాల సీఎం కాన్రాడ్ సంగ్మా సంతాపం ప్రకటించారు. హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కూడా విశ్వ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. విశ్వ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.
Saddened to learn that Tamil Nadu paddler, Deenadayalan Vishwa passed away after an accident in Ri Bhoi District while on his way to Shillong to participate in the 83rd Senior National Table Tennis Championship in our State@ianuragthakur @KirenRijiju @mkstalin @CMOTamilnadu pic.twitter.com/sGvAc3eDhe
— Conrad Sangma (@SangmaConrad) April 17, 2022
Also Read: Corona Fourth Wave: ఢిల్లీలో కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఆదివారం ఒక్కరోజే 517 కొత్త కేసుల
Also Read: Rains in Telangana: వెదర్ అలర్ట్... తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook