Post Office Time Deposit Scheme: బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులో కూడా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి వడ్డీ కూడా లభిస్తుంది. అందులో ఒకటి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. దీన్ని మనం సాధారణ భాషలో పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ అని అంటుంటాము. పోస్టాఫీసులో  మీకు  1, 2, 3, 5ఏండ్ల కాలవ్యవధితో ఎన్నో స్కీములు ఉంటాయి. అయితే వడ్డీ రేటు మాత్రం స్కీమును బట్టి మారుతుంది. కానీ మీరు ఎక్కువ వడ్డీ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం 5ఏండ్ల కాలవ్యవధితో ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడం మంచిది. దీనిలో మీరు అధిక వడ్డీని పొందవుతారు. అంతేకాదు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 5 ఏండ్లలోపు దాన్ని విత్ డ్రా చేయకూడదు. మీరు మధ్యలోనే డబ్బులు విత్ డ్రా చేసినట్లయితే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక  లాభాల గురించి మాట్లాడినట్లయితే, ప్రస్తుతం టైమ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. మీరు అందులో రూ.  5,00,000 పెట్టుబడి పెడితే, మీరు 5 సంవత్సరాలలో దానిపై రూ. 2,24,974 వడ్డీని పొందుతారు. అంటే మీరు 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై రూ. 7,24,974 పొందుతారు. 5లక్షలకు రెండు లక్షల వడ్డీ వస్తుంది. అంతేకాదు మీరు  ఈ FDలో సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం కూడా పొందుతారు.


Also Read: ZEE: రతన్ టాటా ఆటోబయోగ్రఫీ సినిమా నిర్మాణం ద్వారా ఘననివాళి అర్పిస్తాం..జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ప్రకటన


మీరు ఈ ఎఫ్డీ నుండి మంచి లాభాలను పొందాలనుకుంటే, దాని పదవీకాలం పూర్తయ్యేలోపు దాన్ని విత్ డ్రా చేయకండి. మీరు మధ్యలోనే విత్ డ్రా చేసినట్లయితే భారీగా నష్టపోతారు. నిబంధనల ప్రకారం, మీరు 6 నెలల తర్వాత 5 సంవత్సరాల కాలవ్యవధితో ఎఫ్డీ ఖాతాను క్లోజ్  చేస్తే ఏడాది పూర్తయ్యేలోపు పొదుపు ఖాతాపై వర్తించే వడ్డీ రేటు ప్రకారం మీరు పెట్టుబడిపై వాపసును పొందుతారు.  ప్రస్తుతం, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాపై 4శాతం చొప్పున వడ్డీ అందుబాటులో ఉంది. 


మీరు ఏడాది తర్వాత ఎఫ్డీని క్లోజ్ చేసినట్లయితే.. టైమ్ డిపాజిట్‌పై వర్తించే ప్రస్తుత వడ్డీ రేటు నుండి 2శాతం వడ్డీని తీసివేసిన తర్వాత డబ్బు మీకు తిరిగి వస్తుంది. అంటే, మీరు 7.5% చొప్పున వడ్డీని పొందుతున్నట్లయితే, మెచ్యూర్‌కు ముందు అకౌంట్ మూసివేస్తే , ఈ వడ్డీ 5.5శాతానికి తగ్గుతుంది. 


పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌కి సంబంధించిన ప్రత్యేక విషయాలు: 


-మీరు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌లో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు. దీనికి  గరిష్ట పరిమితి లేదు.


-మీరు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ కూడా తీసుకోవచ్చు. ఖాతాకు సంబంధించి ఎటువంటి పరిమితి లేదు.


-ఖాతా తెరిచే సమయంలో ఏ వడ్డీ రేటు ఉంటుందో, ఖాతా కాలవ్యవధి పూర్తయ్యే వరకు అదే వడ్డీ రేటు వర్తిస్తుంది.


-మీరు ఖాతా తెరిచిన తేదీ నుండి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత వడ్డీ మీ ఖాతాలో జమ అవుతుంది. 


-18 ఏళ్లు పైబడిన ఎవరైనా TD ఖాతాను తెరవవచ్చు. పిల్లల కోసం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల తరపున ఖాతాలను తెరవవచ్చు.


-10ఏండ్లు నిండిన పిల్లవాడు తన సంతకంతో తన ఖాతాను ఆపరేట్ చేయవచ్చు. అతను తన పేరు మీద కూడా ఈ ఖాతాను తీసుకోవచ్చు.


-మీరు 5 సంవత్సరాల పాటు టైమ్ డిపాజిట్ ఖాతాను తెరిస్తే, అందులో జమ చేసిన డబ్బుపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.


Also Read: Free Laptop Scheme : మోదీ సర్కార్ స్టూడెంట్స్ కోసం బంపర్ ఆఫర్.. విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ స్కీం ప్రారంభం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.