ZEE Entertainment Enterprises : లక్షలాది మంది భారతీయుల అభ్యున్నతికి కారణమైన భారత ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలిచిన కృషి చేసిన కార్పొరేట్ దిక్సూచికి వినయపూర్వకమైన నివాళి అందిస్తున్నామని ZEE ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ MD , CEO పునీత్ గోయెంకా తెలిపారు. అలాగే “రతన్ టాటా జీవిత చరిత్రపై ఒక చిత్రాన్ని సైతం నిర్మిస్తామని ప్రతిపాదించారు. అంతటి గొప్ప వ్యక్తికి నివాళులర్పించడానికి , ఇదే సరైన మార్గమని తాము భావిస్తున్నట్లు తెలిపారు. అత్యున్నతమైన విలువలతో కూడిన, దూరదృష్టి గల పారిశ్రామికవేత్తగా రతన్ టాటా చేసిన సేవలను దేశానికి , ప్రపంచానికి, ముఖ్యంగా యువతకు అందించాలని ఈ సందర్భంగా పునీత్ గోయెంకా అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ZEE ఎంటర్ టైన్ మెంట్ ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు.
ZEEL చైర్మన్ ఆర్ గోపాలన్ మాట్లాడుతూ రతన్ టాటా లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రతన్ టాటా బయోగ్రఫీ చిత్రం ప్రాజెక్ట్‌కి ఆమోదం తెలుపుతూ, ఈ సినిమాను రతన్ టాటాకు నివాళులు అర్పించేలా ZEE స్టూడియోస్ నిర్మిస్తుందని చెప్పారు. ఈ చిత్రం ప్రపంచానికి రతన్ టాటా జీవితాన్ని మరింత విపులంగా వివరిస్తుందని. ఆయన స్ఫూర్తి ముందు తరాలకు అందజేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ సినిమా ప్రాజెక్ట్ టాటా సన్స్ నుండి ZEE ఆమోదం పొందిన అనుమతులకు లోబడి ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం నుండి ZEE స్టూడియోస్ ద్వారా వచ్చే లాభాన్ని సామాజిక కార్యక్రమాల కోసం , పేదలకు సహాయం చేయడం కోసం విరాళంగా ఇస్తామన్నారు.
చలనచిత్రం ప్రపంచవ్యాప్త స్థాయికి చేరుకోవడం కోసం, ZEE స్టూడియోస్ WION (వరల్డ్ ఈజ్ వన్ న్యూస్)తో సహ-నిర్మాతగా సహకరిస్తుంది, తద్వారా చలనచిత్రం ప్రపంచవ్యాప్తంగా 190 కంటే ఎక్కువ దేశాలలో ఎక్కువ మంది వీక్షకుల ద్వారా రీచ్ అవుతుందన్నారు.
ZEE మీడియా సీఈఓ కరణ్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, "ZEE న్యూస్ గ్రూప్‌లోని మేమంతా ZEEL కోరుకున్న, సమయానుకూలమైన నిర్ణయాన్ని ఒక విశేషంగా భావిస్తున్నాము, మరణించిన ఆత్మకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు.
ZEE స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఉమేష్ బన్సాల్ మాట్లాడుతూ, “ ZEE స్టూడియోస్ మొత్తం బృందం రతన్ టాటా జీవితంపై పూర్తి-నిడివి గల డాక్యుమెంటరీ లేదా బయోగ్రాఫికల్ ఫిల్మ్‌లో పని చేయడం చాలా గౌరవంగా , గర్వంగా ఉందన్నారు. రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తిత్వాన్ని, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం మా కర్తవ్యమని మేము నమ్ముతున్నామన్నారు. ZEE స్టూడియో తీసుకుంటున్న ఈ చొరవ భారతదేశం ఎప్పటికీ మరిచిపోదని ఆయన తెలిపారు.
Also Read: Ratan Tata Died: భారత పారిశ్రామిక ఐకాన్ ఇక లేరు ముంబైలో తుది శ్వాస విడిచిన రతన్ టాటా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి