Post Office Saving Plans: సురక్షితమైన సేవింగ్ ప్లాన్స్ అంటే పోస్టాఫీసు పథకాలే. నెలకు పదివేలు పెట్టుబడి పెడుతుంటే..పదేళ్లకు 16 లక్షలు సంపాదించవచ్చు. అదెలాగో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెట్టుబడి మార్గమేదైనా కాస్త రిస్క్ ఉంటుంది. ఈ నేపధ్యంలో పూర్తి సురక్షితమైన పెట్టుబడి మార్గం గురించి తెలుసుకుందాం. ఇందులో పెట్టుబడి సురక్షితమే కాకుండా మంచి రిటర్న్స్ కూడా ఇస్తుంది. ఈక్విటీ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువే ఉంటుంది. రిటర్న్స్ కూడా మిగిలిన వాటితో పోలిస్తే ఎక్కువుంటుంది. కానీ రిస్క్ తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడరు. ఈ నేపధ్యంలో ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే..పోస్టాఫీసు పథకాలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి.


పోస్టాఫీసులో చిన్న చిన్న సేవింగ్ ప్లాన్స్ మంచి ఆప్షన్స్ కాగలవు. ఇందులో రిస్క్ తక్కువ. రిటర్న్స్ ఎక్కువ. రిస్క్ ఏ మాత్రం లేకుండా మంచి రిటర్న్స్ అందించే పధకం గురించి తెలుసుకుందాం. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇందులో ఒకటి. 


పోస్టాఫీసు ఆర్‌డి డిపాజిట్ ఎక్కౌంట్ అనేది మంచి వడ్డీ అందించడమే కాకుండా చిన్న వాయిదాలతో చెల్లించగలిగే ప్రభుత్వ గ్యారంటీ పథకం. ఇందులో మీరు వంద రూపాయల్నించి పెట్టుబడి ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టేందుకు లిమిట్ ఏదీ లేదు. మీరెంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ ఎక్కౌంట్ ఐదేళ్లకు ఉద్దేశించింది. అదే బ్యాంకుల్లో అయితే ఆరు నెలలు, 1 ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్ల వెసులుబాటు ఉంటుంది. ఇందులో జమ చేసే డబ్బులపై వడ్డీని ఏడాదికోసారి లెక్కిస్తారు. ప్రతి ఏటా మీ ఎక్కౌంట్‌లో వేస్తారు. రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ అందుతోంది. ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లో ఉంది. ఏడాదికోసారి చిన్న చిన్న సేవింగ్ ప్లాన్స్ వడ్డీరేట్లను నిర్ణయిస్తుంటారు.


నెలకు పది వేలు డిపాజిట్ చేస్తే..పదేళ్లకు 16 లక్షలు


ఒకవేళ మీరు ప్రతి నెలా పోస్టాఫీసు ఆర్‌డి స్కీమ్‌లో పదివేల చొప్పున పదేళ్లపాటు పెట్టుబడి పెడితే..పదేళ్ల తరువాత 5.8 శాతం వడ్డీ చొప్పున మీకు 16 లక్షల రూపాయలు లభిస్తాయి. ఎలాగంటే..ప్రతినెలా 10 వేల రూపాయలు పదేళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. 5.8 శాతం వడ్డీ లెక్కిస్తారు. అంటే పదేళ్ల తరువాత మెచ్యూరిటీ ఎమౌంట్ 16 లక్షల 28 వేల 963 రూపాయలవుతుంది. 


మీరు ఎక్కౌంట్‌లో క్రమం తప్పకుండా డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ఒకవేళ డబ్బులు జమ చేయకపోతే ప్రతి నెలా మీరు 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 4 వాయిదాలు మానేస్తే..మీ ఎక్కౌంట్ క్లోజ్ అవుతుంది. రికరింగ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల టీడీఎస్ కట్ అవుతుంది. ఒకవేళ డిపాజిట్ 40 వేలకంటే ఎక్కువైతే..ఏడాదికి పది శాతం చొప్పున ట్యాక్స్ కట్ అవుతుంది. రికరింగ్ డిపాజింట్‌పై లభించే వడ్డీపై కూడా ట్యాక్స్ ఉంటుంది. కానీ మెచ్యూరిటీ ఎమౌంట్‌పై మాత్రం పన్ను ఉండదు. ఏ పెట్టుబడులపై అయితే ట్యాక్సెబుల్ ఆదాయం ఉండదో..వాళ్లు..ఫామ్ 15డి నింపి..టీడీఎస్ నుంచి మినహాయింపు పొందవచ్చు. 


Also read: Flipkart End of Season Sale: భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు, మరో నాలుగు రోజులు మాత్రమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.