Post office monthly income schemes: పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసా మీకు..కేవలం ఒకసారి డబ్బులు జమ చేస్తే చాలు..ఆ తరువాత ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. ఆ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో భాగంగా ఒకసారి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రతి నెలా మీకు పెన్షన్ వచ్చినట్టే వడ్డీ లభిస్తుంటుంది. ఈ సూపర్ హిట్ స్కీమ్‌లో ఐదేళ్ల తరువాత మీ డబ్బులు తిరిగి తీసుకోవచ్చు కూడా. పోస్టాఫీసు స్కీమ్ అంటేనే సెక్యూరిటీ ఉంటుందని చాలామందికి నమ్మకం. అందుకే పోస్టల్ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఆకర్ణణీయమైన పధకాలు ప్రవేశపెడుతుంటుంది. ఇప్పుుడు మనం పోస్టాఫీసు ఎంఐఎస్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. కేవలం ఒకసారి డబ్బులు జమ చేసి ఆ తరువాత నెల నెలా వడ్డీని పెన్షన్‌లా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ పూర్తయ్యాక డబ్బులు వాపసు అందుకోవచ్చు.


ఈ స్కీమ్ పేరు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్. ఇందులో కనీసం 1000 లేదా వంద చొప్పున డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో అత్యధికంగా 4.5 లక్షల వరకూ డబ్బులు జమ చేయవచ్చు. ఈ పరిమితి సింగిల్ ఎక్కౌంట్ కోసం. అటు జాయింట్ ఎక్కౌంట్ అయితే 9 లక్షల వరకూ పరిమితి ఉంటుంది. ఈ స్కీమ్ ప్రకారం మ్యాగ్జిమమ్ ముగ్గురు కలిసి జాయింట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ అయితే మాత్రం తల్లి లేదా తండ్రి పేరిట ఓపెన్ చేయవచ్చు. పదేళ్ల వయస్సు దాటితే పిల్లల పేరుమీద కూడా ఎక్కౌంట్ ఓపెన్ అవుతుంది. 


ఈ పధకం ప్రకారం చెల్లింపు అనేది నెలనెలా ఉంటుంది ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ ఉంది. వడ్డీని ఏడాది ఆధారంగా లెక్కిస్తారు. కానీ ఒకవేళ ఇందులో ఎక్కౌంట్ హోల్డర్ మంత్లీ వడ్డీ క్లెయిమ్ చేయకపోతే..దానిపై కూడా అదనపు వడ్డీ జమవుతుంది. పోస్టాఫీసు స్కీమ్ మెచ్యూరిటీ ఐదేళ్లు. ఎక్కౌంట్ ఓపెన్ చేసిన ఏడాది వరకూ ఇందులోంచి డబ్బులు తీయకూడదు. ఒకవేళ మీరు 1-3 ఏళ్లలోపు క్లోజ్ చేయాలనుకుంటే..మీ అసలు డబ్బులోంచి 2 శాతం కటింగ్ అవుతుంది. అటు 3-5 ఏళ్లలోపు క్లోజ్ చేయాలంటే 1 శాతం జరిమానా చెల్లించాలి. 


ఎంఐఎస్ లెక్కల ప్రకారం...ఎవరైనా ఎక్కౌంట్‌లో ఒకేసారి 50 వేల రూపాయలు జమ చేస్తే..ప్రతి నెల అతనికి 275 రూపాయలు చొప్పున ఏడాదికి 33 వందల రూపాయలు ఐదేళ్లపాటు లభిస్తాయి. అంటే ఐదేళ్లలో వడ్డీరూపంలో మొత్తం 16 వేల 5 వందల రూపాయలు లభిస్తాయి. ఒకవేళ 1 లక్ష రూపాయలు జమ చేస్తే..నెలకు 550 రూపాయలు చొప్పున ఏడాదికి 66 వందల రూపాయలు లభిస్తాయి. ఈ స్కీమ్ లో 4.5 లక్షల జమ చేస్తే నెలకు వడ్డీ 2475 రూపాయలు, ఏడాదికి 29 వేల 7 వందల రూపాయలు వడ్డీరూపంలో లభిస్తాయి.


ఈ అద్భుతమైన స్కీమ్‌లో మెచ్యూరిటీ కంటే ముందు ఎక్కౌంట్ హోల్డర్ మరణిస్తే..ఎక్కౌంట్ క్లోజ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రిన్సిపల్ ఎమౌంట్ నామినీకు చెల్లిస్తారు. ఈ పధకంలో డబ్బులు జమ చేస్తే..సెక్షన్ 80 సి కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పోస్టాఫీసు నుంచి డబ్బుల విత్‌డ్రా లేదా వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ఉండదు. 


Also read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్స్.. రూ.24 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7449కే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook