Best Post Office Scheme: పోస్టాఫీసు పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌కు మంచి స్పందన ఉంటుంది. ఐదేళ్ల కాల పరిమితి కలిగిన ఈ పధకంలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌పై 7.7 శాతం వడ్డీ చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీరు కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రిటర్న్స్ ఏ మేరకు ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టాఫీసు నేషనల్ సర్టిఫికేట్ పథకంలో ఎంతవరకైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 7.7 శాతం వడ్డీ చొప్పున ఐదేళ్లకు 44,903 రూపాయలు వడ్డీ రూపంలో తీసుకోవచ్చు. మొత్తం మెచ్యూరిటీ డబ్బులు 1,44,903 రూపాయలు చేతికి అందుతాయి. అదే 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు వడ్డీ రూపంలో 89,807 రూపాయలు అందుతాయి. మొత్తం మెచ్యూరిటీ మొత్తం 2,89,807 రూపాయలు పొందవచ్చు.


ఇక 3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు లభించే వడ్డీ డబ్బులు 1,34,710 రూపాయలుంటుంది. 7.7 శాతం వడ్డీ ఉంటుంది. మొత్తం మెచ్యూరిటీ డబ్బులు 4,34,710 రూపాయలు చేతికి అందుతాయి. అదే 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రూపంలో లభించే మొత్తం 1,79,614 రూపాయలుంటుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ తరువాత 5,79,614 రూపాయలు అందుకోవచ్చు.


అదే 5 లక్షల రూపాయలు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు వడ్డీ 2,24,517 రూపాయలు లభిస్తాయి. మొత్తం మెచ్యూరిటీ నగదు 7,24,517 వేలు అందుతాయి. 


Also read: DA Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ పెంపుపై క్లారిటీ, జీతం, డీఏ ఎంత పెరుగుతాయంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook