Post office scheme : నెలకు రూ. 1411 తో రూ 35 లక్షలు పొందే మార్గం ఇదిగో
post office scheme invest rs 1411 per month get Rs 35 lakhs : ఇండియా పోస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్... గ్రామ్ సురక్ష యోజన స్కీమ్‌కు సంబంధించిన వివరాలు ఇదిగో... తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందే స్కీమ్ ఇది.
post office scheme invest rs 1,411 per month and get Rs 35 lakhs details here : తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి పోస్టాఫీస్ ఒక మంచి స్కీమ్‌ను (Scheme) అమలు చేస్తోంది. అలాగే ఈ పథకం కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియా పోస్ట్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా... "గ్రామ్ సురక్ష యోజన" (Gram Suraksha Yojana) స్కీమ్‌ను అమలు చేస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది ఇండియా పోస్ట్. దేశంలోని గ్రామీణుల కోసం 1995లో గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని (Rural Postal Life Insurance Policy) రూపొందించింది ఇండియా పోస్ట్. (India Post)
గ్రామ్ సురక్ష యోజన స్కీమ్‌లో (Gram Suraksha Yojana Scheme) చేరిన వారికి 80 సంవత్సరాలు వయసు వచ్చాక.. అంటే మెచ్యూరిటీ (Maturity) సమయంలో బోనస్ వస్తుంది. ఒకవేళ ఈ స్కీమ్‌లో చేరిన వారు ముందే మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందుకు సంబంధించిన డబ్బు అందిస్తుంది పోస్టాఫీస్. 19 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వారంతా ఈ పథకంలో చేరేందుకు అర్హులు.
ఇక ఈ స్కీమ్ కోసం కనీసం రూ.10 వేల ఇన్సూరెన్స్ మొత్తానికి పాలసీ తీసుకోవాలి. అలాగే గరిష్టంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ (Insurance) మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియాన్ని... నెల వారీగా, మూడు నెలల వారీగా, ఆరు నెలల వారీగా, ఏడాదొకసారి చొప్పున చెల్లించే వెసులుబాటు కల్పించింది ఇండియా పోస్ట్. (India Post) ప్రీమియం (Premium) చెల్లింపునకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటు కూడా ఉంటుంది.
ఇక పాలసీ కొనుగోలు చేసిన నాలుగేళ్లకు లోన్ కూడా పొందొచ్చు. 55 సంవత్సరాలు, 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే ఈ స్కీమ్‌లో జాయిన్ అయిన వారికి సంవత్సరానికి రూ.1000కు రూ.60 బోనస్ ఇస్తుంది పోస్టాఫీస్. (Post Office)
ఇక 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల పాలసీ తీసుకుంటే, 55 సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ టైమ్‌లో (Maturity Time) రూ.31.6 లక్షలు తీసుకోవచ్చు. అలాగే 58 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే రూ.33.4 లక్షలు అందుకోవచ్చు. ఇక 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం (Premium) చెల్లిస్తే రూ.34.6 లక్షలు వస్తాయి. ఇలా మెచ్యూరిటీ బెనిఫిట్‌లు పొందొచ్చు.
Also Read : Prisoner Swallows Phone: మొబైల్ మింగేసిన ఖైదీ.. ఆపరేషన్ లేకుండానే బయటకు తీసిన వైద్యులు
అలాగే నెలవారీ ప్రీమియం విషయానికి వస్తే, 55 ఏళ్లకు రూ.1515 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక 58 ఏళ్లకుగాను రూ.1463, 60 ఏళ్లకు అయితే రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఈ స్కీమ్‌తో తక్కువ డబ్బుతో ఎక్కువ ఆదాయాన్ని కల్పిస్తుంది ఇండియా పోస్ట్ (India Post).
Also Read : Actress murder case: భర్త చేతిలో సినీ నటి మర్డర్.. గోనెసంచిలో హీరోయిన్ శవం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి