Prisoner Swallows Phone: మొబైల్ మింగేసిన ఖైదీ.. ఆపరేషన్ లేకుండానే బయటకు తీసిన వైద్యులు

Prisoner Swallows Phone: తిహార్ జైలులో ఓ ఖైదీ సెల్​ఫోన్ మింగేశాడు. అధికారులకు తెలియకుండా ఫోన్​ను వాడుతున్న ఆ వ్యక్తి.. తనిఖీల్లో దొరికిపోయాడు. దీంతో అమాంతం ఫోన్​ను మింగేశాడు. పది రోజుల పాటు ప్రయత్నించి ఆపరేషన్ అవసరం లేకుండానే ఫోన్​ను వైద్యులు బయటకు తీశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 06:13 PM IST
    • తిహార్ జైలులో మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ
    • ఆపరేషన్ లేకుండానే బయటకు తీసిన వైద్యులు
    • నిలకడగా ఖైదీ ఆరోగ్య పరిస్థితి
Prisoner Swallows Phone: మొబైల్ మింగేసిన ఖైదీ.. ఆపరేషన్ లేకుండానే బయటకు తీసిన వైద్యులు

Prisoner Swallows Phone: ఢిల్లీలోని తిహార్ జైలులోని ఓ ఖైదీ.. మొబైల్ ఫోన్ ను మింగేశాడు. జైలు వార్డెన్ చేస్తున్న తనిఖీల్లో సెల్ ఫోన్ దొరికిపోతాననే భయంతో దాన్ని మింగేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ జైలు వార్డెన్, ఇతర ఖైదీలు చూస్తుండగానే తాను ఈ పని చేసినట్లు సమాచారం. ఆ సెల్ ఫోన్ 7 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంది. 

దీంతో వెంటనే ఆ ఖైదీని దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సెల్ ఫోన్ అతని పొట్టలో ఉన్నట్లు తేలింది. అయితే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే ఆ సెల్ ఫోన్ ను ఎండోస్కోపి నిర్వహించిన నోటి ద్వారా బయటకు తీశారు. 

ఆపరేషన్ తర్వాత సెల్ ఫోన్ మింగేసిన ఖైదీని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తిహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ చేయకుండానే సెల్​ఫోన్ తీయాలని వైద్యులు భావించిన కారణంగా.. సెల్ ఫోన్ ను బయటకు తీసుకొచ్చేందుకు 10 రోజుల సమయం పట్టిందని తెలుస్తోంది. 

జనవరి 15న ఖైదీ పొట్టలో ఉన్న సెల్ ఫోన్ ను ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. దీంతో అతడిని తిరిగి జైలుకు పంపినట్లు స్పష్టం చేశారు.

అయితే, జైలులోకి సెల్​ఫోన్ ఎలా వచ్చిందనే విషయం ఇంకా తెలియరాలేదు. నిబంధనలన్నీ కఠినంగా అమలు చేసినా ఫోన్ కనిపించడంపై తిహార్ జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

Also Read: PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది..

Also Read: IED Recovered in Delhi: ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం... ఉగ్ర కుట్ర భగ్నం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News