కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనార్ధం చాలా పథకాలు నిర్వహిస్తోంది. ఈ పధకాల్లో పీపీఎఫ్ ఒకటి. పీపీఎఫ్ అనేది అత్యధిక ప్రాచుర్యం పొందిన పథకం.  చాలామందికి పీపీఎఫ్ ప్రత్యేకతలు తెలియవు. పీపీఎఫ్ కాల వ్యవధి ఎంత వంటి వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీపీఎఫ్ మెచ్యూరిటీ


పీపీఎఫ్ అనేది ప్రభుత్వం నడుపుతున్న పథకం. ఇందులో సేవింగ్స్ చేయవచ్చు. పెట్టుబడులు పెట్టవచ్చు. ఇన్‌కంటాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ అనేది 15 ఏళ్ల కాల వ్యవధితో ఉండే ఓ ఇన్వెస్ట్‌మెంట్. అలాగని 15 ఏళ్ల పాటు మీ డబ్బులు లాక్ కావు. 15 ఏళ్ల కాల వ్యవధి మీరు ఎక్కౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రారంభమౌతుంది. 15 ఏళ్ల కాల వ్యవధి అంటే పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ..ఎక్కౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 15 ఏళ్ల వరకని అర్ధం.


పీపీఎఫ్ బ్యాలెన్స్ చెక్


ఒకవేళ పీపీఎఫ్ మెచ్యూరిటీ కంటే ముందు కొంత డబ్బు తీయాలనుకుంటే తీసుకోవచ్చు. 6వ సంవత్సరం తరువాత పీపీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అందుకే కొంతమంది పీపీఎఫ్‌ను ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో వినియోగిస్తుంటారు. పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు ఎమర్జెన్సీ సమయంలో డబ్బులు తీసుకునే అనుమతిస్తుంది. పీపీఎఫ్ ఎక్కౌంట్ 6వ ఏడాది తరువాత..4వ ఏడాది అనంతరం జమ అయిన డబ్బుల్లోంచి 50 శాతం తీయవచ్చు. 


పీపీఎఫ్ ఎమౌంట్


ఒకవేళ వ్యవధి పెంచుకుంటే మిగిలిన డబ్బుల్లోంచి 60 శాతం డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ కంటే ముందు డబ్బులు తీయాలంటే..ఎమర్జెన్సీ కిందే తీయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ 15 ఏళ్ల లాక్‌ఇన్ పీరియడ్ ఉంటుంది. ఎక్కౌంట్ ఓపెన్ చేసిన 5వ ఏడాది పూర్తయిన తరువాత పీపీఎఫ్ ఎక్కౌంట్ నుంచి కొద్దిగా డబ్బులు తీయవచ్చు. అంటే ఉదాహరణకు 2015లో మీరు పీపీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే..2020-21లో పీపీఎఫ్ నుంచి డబ్బులు డ్రా చేయగలరు. 


Also read: Cheapest Honda City Cars: రూ. 5.33 లక్షలకే హోండా సిటీ కారు.. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook