PPF Interest Rate: పీపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు గుడ్‌న్యూస్, మీ నగదుపై రెట్టింపు వడ్డీ, ఎలాగో తెలుసుకోండి

PPF Interest Rate: పీపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు శుభవార్త, ఇప్పుడు మీ ఎక్కౌంట్లల నగదుపై రెట్టింపు వడ్డీ పొందే అద్భుత అవకాశం. ఈ అద్భుత ఆఫర్ మీకు ఎవరెవరికి వర్తించనుంది, ఎంత వడ్డీ లభిస్తుందనే వివరాలు తెలుసుకుందాం..
PPF Interest Rate: పీపీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ చేసుకున్నవారికి శుభవార్త. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ ఎక్కౌంట్ తెర్చుకుంటే రెట్టింపు వడ్డీ లభించే అవకాశముంది. ఈ వివరాల్ని అందించింది ప్రభుత్వమే. డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే మంచి అవకాశం. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అనువైంది. మెచ్యూరిటీ అనంతరం పెద్దమొత్తం డబ్బులు చేతికి అందుతాయి.
1.5 లక్షల వరకూ డిస్కౌంట్
పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈఈఈ కేటగరీలో ఉంటుంది. అంటే పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ నగదు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. మీకు పెళ్లై ఉండి..పీపీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.
పీపీఎఫ్‌లో పెట్టుబడికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లక్షలు మీ పేరిట, 1.5 లక్షల రూపాయలు మీ భార్య పేరిట ఓపెన్ చేయవచ్చు. అంటే రెండు ఎక్కౌంట్ల లబ్ది పొందవచ్చు. 1.5 లక్షల ఎక్కౌంట్ కిందే పరిగణిస్తారు. పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ 3 లక్షల వరకూ రెట్టింపు అవుతుంది. మీ భాగస్వామి పేరుతో ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే రెండు ఎక్కౌంట్లు ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి. వడ్డీ మాత్రం రెండు ఎక్కౌంట్ల ప్రయోజనం వర్తిస్తుంది. సెక్షన్ 64 ఇన్‌కంటాక్స్ ప్రకారం ఇది మంచి అవకాశం.
Also read: FD Interest Rates 2023: ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీ వడ్డీరేటు.. ఏకంగా 9.50 శాతం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook