PPF Balance: అత్యంత ప్రజాధరణ పొందిన పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఒకటి. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు, ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం మెరుగైన ఆదాయం, ట్యాక్స్ ఆదా పరంగా ప్రయోజనాలు ఉన్నాయి. పీపీఎఫ్‌ పథకం 1968లో ఆర్థిక మంత్రిత్వ శాఖ నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రారంభించారు. పీపీఎఫ్‌పై వడ్డీ రేటు విషయానికొస్తే.. ఈ రేటు 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌తో అనుసంధానించడంతో నిర్ణయించలేదు. గత మూడు నెలల్లో సగటు బాండ్ రాబడి ఆధారంగా త్రైమాసికం ప్రారంభంలో పీపీఎప్‌ వడ్డీ రేటును నిర్ణయిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీపీఎఫ్‌ పెట్టుబడి ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో అమలులోకి వస్తుంది. ప్రతి సంవత్సరం గడిచే కొద్ది ఈ లాక్ ఇన్ వ్యవధి క్రమంగా తగ్గుతుంది. మీరు ఏప్రిల్ 2023లో పీపీఎఫ్‌ ఖాతాను తెరిస్తే.. అది మార్చి 2038లో మెచ్యూర్ అవుతుంది. మీరు మీ పీపీఎఫ్‌ ఖాతా మెచ్యూర్ అయిన తర్వాత మొత్తం కార్పస్‌ను ఉపసంహరించుకోవచ్చు. మీరు సాధ్యమయ్యేంత వరకు కార్పస్‌ను అలానే ఉంచుకోవచ్చు. కానీ 5 సంవత్సరాలలోపు తీసుకోవాలి.


15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయిన మీ పీపీఎఫ్‌ ఖాతా నుంచి మీ డబ్బును విత్‌డ్రా చేయకపోతే.. డిఫాల్ట్‌గా ఖాతా గడువు పెరుగుతుంది. మీ పీపీఎఫ్‌ కార్పస్ ప్రభుత్వం పొడిగించిన వ్యవధిలో వడ్డీ రేటు తగ్గుతుంది. మీ పీపీఎఫ్‌ ఖాతా మెచ్యూర్ అయిన తరువాత మీకు ఉన్న మొదటి ఎంపిక ఖాతాను మూసివేసి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడమే ఉత్తమం. మీ ఖాతాను మూసివేయకుండా ఉండటానికి మీకు మరో ఆప్షన్ కూడా ఉంది. మెచ్యూరిటీ తర్వాత ఎటువంటి తాజా డిపాజిట్లు చేయకుండానే.. మరో 5 సంవత్సరాల కాల వ్యవధిని పొడిగించుకోవచ్చు.


Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు  


Also Read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి