PPF Scheme Latest Updates: మనం సంపాదించిన ప్రతి రూపాయిలో ఎంతో కొత్త సేవ్ చేసుకుంటే.. భవిష్యత్‌లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. పొదుపు చేసిన డబ్బులను సరైన స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మంచి ఆదాయం వస్తుంది. ప్రజలను పొదుపు దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం అనేక పథకాలను తీసుకువచ్చింది. వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ కూడా ఒకటి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్న వారికి ఈ స్కీమ్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు పూర్తిగా సేఫ్‌. మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా ప్రభావితం కాదు. ఈ స్కీమ్ వడ్డీ రేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై 7.1 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌లో పీపీఎఫ్‌ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. కేవలం రూ.500 నుంచి అకౌంట్ తెరవొచ్చు. ఇందులో ఏటా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్లు. మెచ్యూరిటీ తర్వాత ఐదేళ్ల చొప్పున మరింత పొడిగించే సదుపాయం ఉంది. మీరు ప్రతి నెలా పీపీఎఫ్ ఖాతాలో రూ.12,500 జమ చేస్తూ.. 15 ఏళ్లపాటు మెయింటెయిన్ చేస్తే మెచ్యూరిటీపై మొత్తం రూ.40.68 లక్షలు పొందుతారు. ఇందులో మీ మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు కాగా.. వచ్చే 15 సంవత్సరాలకు సంవత్సరానికి 7.1% వడ్డీ రేటును అంచనా వేస్తే.. వడ్డీ ద్వారా రూ.18.18 లక్షలు మీ ఆదాయం వస్తుంది. 


ఈ స్కీమ్ ద్వారా మీరు కోటీ ద్వారా మీరు కోటీశ్వరులు కావాలంటే.. 15 ఏళ్ల తర్వాత ఐదేళ్ల చొప్పున రెండుసార్లు పెంచాలి. అంటే ఇప్పుడు మీ పెట్టుబడి కాలవ్యవధి 25 ఏళ్లుగా మారింది. ఈ విధంగా 25 సంవత్సరాల తర్వాత మీ మొత్తం కార్పస్ రూ.1.03 కోట్లు అవుతుంది. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ.37.50 లక్షలు కాగా.. వడ్డీ ఆదాయంగా రూ.65.58 లక్షలు పొందుతారు. మీ అకౌంట్‌ను పొడగించాలనుకుంటే.. మెచ్యూరిటీకి ఒక ఏడాది ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మీరు అడిగినా స్కీమ్‌ను పొడగించే అవకాశం ఉండదు.


పీపీఎఫ్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌పై సెక్షన్ 80 సీ కింద ట్యాక్స్‌ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈ పథకంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి మినహాయింపు పొందొచ్చు. పీపీఎఫ్‌లో సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీగానే తీసుకోవచ్చు. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ 'EEE' కేటగిరీ కింద వస్తుంది.


Also Read: Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!  


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook