దేశంలో ఎక్కువమంది ఎంచుకునే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్. అంటే పీపీఎఫ్. దేశంలో చాలా ఆదరణ పొందిన పధకం. ఈ పధకానికి సంబంధించి కొన్ని కీలకమైన సందేహాలు, వివరాలు తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఈ పధకం లాకింగ్ పీరియడ్, ఎప్పుడు ఎలా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చనే వివరాలు చాలామందికి తెలియవు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీపీఎఫ్ లాకింగ్ పీరియడ్ అనేది 15 ఏళ్లుంటుంది. అంటే ఈలోగా డబ్బులు అవసరమైతే విత్‌డ్రా చేయలేమని..15 ఏళ్ల తరువాత మెచ్యూరిటీ రూపంలో పెద్దఎత్తున డబ్బులు లభిస్తాయని అంటారు. ఈ విషయంపై వాస్తవం చాలామందికి తెలియుదు. పీపీఎఫ్ పధకంలో 15 ఏళ్ల కాల వ్యవధి కోసం ప్రతి యేటా 500 రూపాయల నుంచి 1.5 లక్షల వరకూ జమ చేసుకునే అవకాశముంది. పీపీఎఫ్‌లో వడ్డీ అనేది ప్రతియేటా ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది. ప్రస్తుతం ఈ పధకంలో వడ్డీ రేటు 7.1 శాతం ఉంది. పీపీఎఫ్‌లో 15 ఏళ్ల లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోగా అంటే మెచ్యూరిటీ పూర్తయ్యేలోగా డబ్బులు డ్రా చేయలేమని. 15 ఏళ్ల తరువాత మాత్రం భారీగా డబ్బులు చేతికి అందుతాయనే ప్రచారం సాగుతోంది. ఇది ఎంతవరకూ నిజం..


5 ఏళ్ల తరువాత


పీపీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 5 ఏళ్లు పూర్తయ్యాక పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. నాలుగో ఏడాది ముగిసేసరికి ఎక్కౌంట్‌లో ఉన్న నగదు మొత్తంలో 50 శాతం మాత్రమే డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఎవరైనా వ్యక్తి తన లేదా తన కుటుంబంలోని వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయవచ్చు. అంటే వైద్య ఖర్చుల కోసం కావల్సిన డబ్బులు తీసుకునే అవకాశముంది. 


ఉన్నత విద్య కోసం


ఒక పీపీఎఫ్ ఖాతాదారుడు తన లేదా పిల్లల చదువు ఖర్చుల కోసం పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీయవచ్చు. తీయాల్సిన గరిష్ట మొత్తం నాలుగో ఏడాది చివరిలో మిగిలిన మొత్తంలో 50 శాతం లేదా గత ఏడాది చివర్లో ఉన్న మిగిలిన మొత్తంలో ఏది తక్కువైతే అంత తీసుకోవచ్చు. ఖాతాదారుడు చనిపోతే మాత్రం సంబంధిత నామినీ మొత్తం డబ్బుల్ని ఒకేసారి తీసుకోవచ్చు. 


పీపీఎఫ్ డబ్బుల్ని ఆన్‌లైన్‌లో ఎలా తీసుకోవాలి


పీపీఎఫ్ డబ్బుల్ని ఆన్‌లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంది. ముందుగా సంబంధిత బ్యాంకు లేదా పోస్టాఫీసు లింక్ ఓపెన్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తరువాత ఎంత డబ్బులు తీసుకోవాలో ఆ మొత్తం ఎంటర్ చేయాలి. ఎక్కౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ సహా బ్యాంకు ఎక్కౌంట్ వివరాలు నమోదు చేయాలి. అంటే ఏ బ్యాంకు ఎక్కౌంట్‌లో డబ్బులు జమ కావల్సి ఉంటుందో ఆ వివరాలు నమోదు చేయాలి. వివరాలు ధృవీకరణ పూర్తయితే మీరు ఎంటర్ చేసిన డబ్బులు సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ అయిపోతాయి. 


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక, త్వరలో డీఏ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కీలక ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook