PMKMY pension scheme: పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన.. సన్నకారు రైతులకు నెలకు రూ.3000 పెన్షన్
PMKMY pension scheme: చిన్న, సన్నకారు రైతులకోసం కేంద్రం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనను ఆవిష్కరించింది. ఈ పథకం ఉద్దేశం ఏమిటి? ఎవరు అర్హులు?
PMKMY pension scheme: చిన్న, సన్నకారు రైతులకు సామాజిక భద్రతను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (పీఎంకేఎంవై) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
చిన్న, సరన్నకారు రైతులు వృద్ధాప్యంలో ఇబ్బందులు లేకుండా జీవిచేందుకు, ఏదైనా కారణం వల్ల ఉపాధి కోల్పోవడం వంటివి జరిగితే.. ఈ పథకం వారికి అండగా నిలుస్తుంది.
2019 ఆగస్టు 9న ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. 3-5 కోట్ల మంది చిన్న సన్న కారు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతారని ప్రభుత్వం అంచనా వేసింది.
ప్రయోజనాలు..
ఈ పథకం ద్వారా అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు ప్రతి నెల రూ.3,000 చొప్పున పెన్షన్ లభించనుంది. అయితే 60 ఏళ్లుపైబడిన వారికి మాత్రమే ఈ పెన్షన్ లభిస్తుంది.
అర్హతలు..
ఈ పథకం ద్వారా పెన్షన్ పొందేందుకు 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు మాత్రమే అర్హులు.
29 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే.. నెలకు రూ.100 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇంతే మొత్తంలో జమ చేస్తుంది.
కనీసం 20 ఏళ్లు పొదుపు చేసిన వారికి మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తిగా అందుతాయి.
అయితే ఈ పథకంలో చేరేందుకు కచ్చితమైన కొన్ని నిబంధనలు విధించింది ప్రభుత్వం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులుగా గుర్తింపు పొందటం సహా ఆర్థిక స్థితి వంటివాటిని పరిగణలోకి తీసుకుంటుంది.
వారికి ప్రయోజనకరం..
వ్యవసాయ పనులు చేసే వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఎందుకంటే.. వ్యవసాయ పనులు చేసే వారు పొలాల్లో చాలా కష్టపడతారు. ఈ కారణంగా వృద్ధాప్యంలో వారికి అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే ఈ పథకంలో పొదుపు చేయడం ద్వారా వృద్ధాప్యంలో కొంతైనా ఆర్థిక భరోసా లభిస్తుంది. పురుషులు, మహిళలు అనే భేదం లేకుండా అందరికీ ఈ పథకం ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి అని ఈ పథకం ప్రారంభం సమయంలో ప్రభుత్వం పేర్కొంది.
Also read: Budget 2022: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు- విపక్షాల అస్త్రాలు రెడీ..!
Also read: Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో వివిద ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook