Cooking Oil: త్వరలో సామాన్యులకు మరింత ఊరట కల్గనుంది. దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈనేపథ్యంలో దేశంలోనూ నూనెల ధరలను తగ్గించాలని తయారీ సంస్థలు యోచిస్తున్నాయి. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయి. ఈక్రమంలోనే కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా పరిస్థితులపై చర్చించారు. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా దేశంలో ధరలు ఉండాలని సదరు సంస్థలను అధికారులు ఆదేశించారు. దీంతో దేశీయంగానూ వంట నూనెల ధరలను తగ్గిస్తామని సదరు సంస్థల ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈమేరకు వరుసగా కథనాలు వస్తున్నాయి. త్వరలోనే వంట నూనెల ధరలు రూ.10 నుంచి రూ.12 వరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న ధరలు మరింత తగ్గనున్నాయి. 


ఇటీవల ఫార్చూన్ బ్రాండ్‌పై వంట నూనెలు తగ్గాయి. ఆయిల్ ధరలను రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు అదానీ విల్మర్ కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయంగా వంట నూనెలు తగ్గుతున్నాయని..ఆ ప్రయోజనాలు దేశ ప్రజలకు అందాలని ఇటీవల ఆయా సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈక్రమంలోనే ఒక్కోక్క కంపెనీ ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. వంట నూనెల ధరలను మరింత తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో మరోమారు ధరలను సవరించేందుకు సదరు కంపెనీలు రెడీ అవుతున్నాయి. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. ఉక్రెయిన్ నుంచే చాలా దేశాలకు వంట నూనెలు దిగుమతి అవుతున్నాయి. ఈక్రమంలో భారత్‌లో వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశీయంగా లీటర్ నూనె ధర రూ.200 దాటిపోయింది. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వీటితోపాటు అంతర్జాతీయంగా పరిణామాలు అనుకూలంగా మారాయి. దీంతో క్రమేపి వంట నూనెల ధరలు దిగి వస్తున్నాయి. 


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవన ద్రోణి ఎఫెక్ట్..రాగల మూడు రోజులపాటు రెయిన్ అలర్ట్..!


Also read:AP Cets: ఏపీలో ఎడ్‌సెట్, లాసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చూడండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook