Privatization నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఆతర్వాత లాభాల్లో నడుస్తున్న సంస్థలను కూడా అమ్ముతోంది. ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈపాటికే చాలా సంస్థల్లో మెజార్టీ వాటాలను అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. త్వరలో మరో రెండు ప్రభుత్వ బ్యాంకులను అమ్మేసేందుకు సిద్ధం అవుతోంది.  బ్యాంకుల ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది.  ఈ క్రమంలో సెప్టెంబర్ నుంచి బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రారంభం కావొచ్చని సమచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు బ్యాంక్ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రయివేటీకరణు వ్యతిరేకిస్తూ సమ్మె బాట పడుతున్నారు. ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో ప్రయివేటీకరణ ఆలస్యం అవుతోంది. అయితే ప్రస్తుతానికి జాప్యం అయినా త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలుస్తోంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో విదేశీ యాజమాన్య పరిమితిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.  ఇప్పుడు 20 శాతం పరిమితి ఉంది. దీన్ని తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఇదు కోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కు సవరణలు తీసుకురావాలని చూస్తోంది. 


రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రయివేటీకరించేందుకు ఈ పాటికే రంగం సిద్ధమైంది. ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇక కేంద్ర కేబినెట్ ఆమోదం లభించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆతర్వాత ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించుకున్న తర్వాత పెట్టుబడుల ఉపసంహరణపై మంత్రుల బృందం ప్రైవేటీకరణ కోసం బ్యాంకుల పేర్లను ఖరారు చేసే అవకాశం  ఉంది. 


మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ అంశాన్ని సూచాయిగా వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ ఉంటుందని సూచించారు. నీతి ఆయోగ్ కూడా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎంపిక చేసేసిందని వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ లను ప్రైవేటీకరణ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  ఈ రెండు బ్యాంకులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రయివేటీకరించే అవకాశం ఉంది. 


also read  Google Ads: వినియోగదారులకు గుడ్ న్యూస్‌ చెప్పిన గూగుల్..ఇకపై కేవలం మనకు ఇష్టమైన యాడ్‌ను మాత్రమే చూడోచ్చు..!!


also read  Net Banking Tips: పొరపాటున మరొకరి ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా... ఇలా చేస్తే మీ డబ్బును తిరిగి పొందవచ్చు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.