Net Banking Tips: పొరపాటున మరొకరి ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా... ఇలా చేస్తే మీ డబ్బును తిరిగి పొందవచ్చు...

Net Banking Tips: మీరు నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా... అయితే ఈ టిప్స్ మీకోసమే... మీరెప్పుడైనా పొరపాటున వేరేవాళ్ల ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే... ఆ డబ్బును తిరిగి ఎలా పొందాలో తెలుసుకోండి... 

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 04:18 PM IST
  • నెట్ బ్యాంకింగ్ టిప్స్
  • మీరు నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా...
  • ఎప్పుడైనా పొరపాటున వేరేవాళ్లకు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే... తిరిగి ఎలా పొందాలో తెలుసా
  • ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
Net Banking Tips: పొరపాటున మరొకరి ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా... ఇలా చేస్తే మీ డబ్బును తిరిగి పొందవచ్చు...

Net Banking Tips: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక చాలామంది నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్నారు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు ఒకరి అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేయబోయి మరొకరి ఖాతాకు పంపిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ డబ్బును ఎలా వెనక్కి పొందాలో వారికి తెలియదు. అలా తప్పుడు ఖాతాకు పంపించిన డబ్బును తిరిగి ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇలా చేస్తే మీ డబ్బు మళ్లీ ఖాతాలోకి :

పొరపాటున వేరే అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే వెంటనే సంబంధిత బ్యాంక్ సిబ్బందికి తెలియజేయండి.
కస్టమర్ కేర్‌కు ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వండి.
ఆ లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను వారికి వెల్లడించండి.
ఆ లావాదేవీ జరిగిన తేదీ, సమయం, మీ ఖాతా నంబర్, పొరపాటున నగదు బదిలీ చేయబడిన ఖాతా వివరాలను ఇవ్వండి.

ఎంత సమయం పట్టవచ్చు :

కొన్నిసార్లు మీ డబ్బు వెంటనే తిరిగి వెనక్కి రావొచ్చు. 
కొన్ని సందర్భాల్లో మాత్రం 2 నెలల సమయం పట్టవచ్చు.
మీరు పొరపాటున నగదు ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంక్ అకౌంట్... ఏ నగరంలోని ఏ శాఖలో ఎవరికి చెందినదో మీరు బ్యాంకు సిబ్బంది నుంచి తెలుసుకోవచ్చు.
బ్యాంకింగ్ సిబ్బంది సదరు బ్రాంచ్ సిబ్బందితో మాట్లాడి మీ డబ్బును వెనక్కి పొందేలా చర్యలు తీసుకుంటారు.
మీరు పొరపాటున ఎవరి ఖాతాలోకి మనీ ట్రాన్స్‌ఫర్ చేశారో... ఆ మనీ తిరిగి మీ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సదరు వ్యక్తి నుంచి బ్యాంకింగ్ సిబ్బంది అనుమతి కోరుతారు.

మరో పద్దతి ఏంటంటే...  :

ఒకవేళ సదరు వ్యక్తి మీ డబ్బును మీకు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇందుకోసం కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. ఆర్బీఐ నిబంధనలను అనుసరించి పొరపాటున జరిగే ట్రాన్సాక్షన్స్ పట్ల సంబంధిత బ్యాంకింగ్ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టును ఆశ్రయిస్తే.. ఆ మేరకు సదరు బ్యాంకుకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. 

Also Read: Chandra Babu Naidu: సీఎం జగన్ ఇలాకాలో చంద్రబాబు పాచికలు పారుతాయా..?

Also Read: Janhvi Kapoor Pics: పొట్టి డ్రెస్సులో జాన్వీ కపూర్.. అమ్మడిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News