Providence India New Office: తెలంగాణ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తోందని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ ఇంజనీరింగ్, ఆపరేషన్స్, ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు ఉన్న ప్రావిడెన్స్ ఇండియా హైదరాబాద్‌లో మరో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. జ్యోతి ప్రజ్వళన చేసి ఆఫీసును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ప్రావిడెన్స్ వృద్ధిని కొనసాగించడం హర్షణీయం అని అన్నారు. 2025 నాటికి కొత్తగా 2,000 మంది ఉద్యోగాలు లభిస్తాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధిని సులభతరం చేసే పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపై మరింత దృష్టిసారించామని చెప్పుకొచ్చారు. ఈ విస్తరణ ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణను ప్రధాన రాష్ట్రంగా చేయాలనే తమ లక్ష్యానికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Hanuma Vihari: హనుమా విహారి సంచలన పోస్ట్.. ఆ ప్లేయర్‌ను తిట్టినందుకే కెప్టెన్సీ పోయింది..  


రాష్ట్రంలో ప్రజలు అందరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. దీని వల్ల ప్రజల ఆరోగ్య సమాచారం అంతా డిజిటల్‌గా అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా చికిత్సా విధానం సులభతరం అవుతుందన్నారు. రానున్న రెండేళ్లలో 4 కోట్ల మంది హెల్త్ ప్రొఫైల్స్‌ సిద్ధం చేసే దిశగా ప్లాన్ చేస్తున్నామన్నారు.


ఈ సందర్భంగా ప్రావిడెన్స్ అధ్యక్షుడు, సీఈఓ రాడ్ హాక్మన్ మాట్లాడుతూ.. కరుణతో కూడిన ఆవిష్కరణ అనే ధ్యేయంతో పని చేస్తోందని చెప్పారు. భారత్‌లో నర్సులు, వైద్యులతోపాటు రోగులకు సేవ చేస్తున్న వారందరికీ మద్దతు ఇస్తూనే.. హెల్త్ కేర్ టెక్నాలజీని అందించడంలో కీలక పాత్ర పోషించామన్నారు. తాము గ్లోబల్ కేపాబిలిటీ మోడల్‌ను వినియోగించుకుంటున్నామన్నారు. జెనరేటివ్ ఏఐ, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ప్రాసెస్ ఆటోమేషన్, గ్లోబల్ కవరేజ్ తదితర అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ పరివర్తనను వేగవంతం చేస్తున్నామన్నారు. 


ప్రస్తుతం తమ వద్ద 1400 మంది పని చేస్తున్నారని ప్రావిడెన్స్ ఇండియా చీఫ్ గ్లోబల్ ఆఫీసర్ అండ్ కంట్రీ హెడ్ మురళీ క్రిష్ణ తెలిపారు. వచ్చే 2, 3 సంవత్సరాల్లో ఉద్యోగుల సంఖ్య 4 వేలకు పెంచుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలో మరిన్ని ఆస్పత్రులతో భాగస్వామ్యాలు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఏఐ-ఆధారిత ప్రొడక్ట్‌లు, సేవలతో విలువను అన్‌లాక్ చేసేందుకు తాము యూఎస్ ఆరోగ్య వ్యవస్థలతో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. 


Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి