PPF Investment: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక. భవిష్యత్తులో ఆర్ధికంగా రక్షణ కల్పిస్తుంది. 15 ఏళ్లపైబడి అద్భుతమైన రిటర్న్స్ అందిస్తుంది. ఈ పథకంలో ఏడాదికి 500 నుంచి లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌కు సంబంధించి కీలకమైన అలర్ట్ జారీ అయింది. మీకు పీపీఎఫ్ ఖాతా ఉంటే ఈ తప్పులు లేదా పొరపాట్లు జరగకుండా చూసుకోవల్సి ఉంటుంది. లేదంటే మీ ఎక్కౌంట్ ఇనాక్టివ్ అయిపోతుంది. పీపీఎఫ్ ఎక్కౌంట్‌ను ఎవరు ఎప్పుడైనా తెరవవచ్చు. మీ పిల్లల కోసం కూడా ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేసేదైతే తల్లి లేదా తండ్రి మాత్రమే యాక్సెస్ చేయగలరు. పీపీఎఫ్ పథకంలో ఏడాదికి 1.5 లక్షల వరకూ ఇన్వెస్ట్‌మెంట్ పరిమితి ఉంటుంది. ఒకే ఏడాదిలో అంతకుమించి ఇన్వెస్ట్ చేస్తే మీ ఎక్కౌంట్ ఇనాక్టివ్ కాగలదు. 


ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే పీపీఎఫ్ ఎక్కౌంట్ ఇద్దరి పేరుపై అంటే జాయింట్‌గా ఓపెన్ చేయడం వీలుకాదు. అలా చేస్తే బ్యాంక్ లేదా పోస్టాఫీసు మీ ఎక్కౌంట్‌ను ఇనాక్టివ్ చేస్తుంది. 15 ఏళ్ల తరువాత పీపీఎఫ్ ఎక్కౌంట్ కొనసాగిస్తే సంబంధిత పోస్టాఫీసు లేదా బ్యాంకుకు సమాచారమివ్వాలి. ఏ సమాచారం లేకుండా 15 ఏళ్ల తరువాత కూడా ఎక్కౌంట్ కొనసాగిస్తే అప్పుడు కూడా ఎక్కౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ః


Also read: Business Idea: ఈ వ్యాపారం మొదలుపెట్టండి.. రూ.1.70 లక్షలు పెట్టుబడితో నెలకు రూ.40 వేల ఆదాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook