Business Idea: ఈ వ్యాపారం మొదలుపెట్టండి.. రూ.1.70 లక్షలు పెట్టుబడితో నెలకు రూ.40 వేల ఆదాయం

Jam Jelly And Murabba Manufacturing Business: ఏ వ్యాపారం అయినా ఎంతోకొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకపోతే అది వ్యాపారమే కాదు. అయితే మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి లాభానష్టాలు ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువగా ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందులో బిజినెస్ మొదలుపెడితే మంచి లాభాలు ఉంటాయి. వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2023, 11:23 PM IST
Business Idea: ఈ వ్యాపారం మొదలుపెట్టండి.. రూ.1.70 లక్షలు పెట్టుబడితో నెలకు రూ.40 వేల ఆదాయం

Jam Jelly And Murabba Manufacturing Business: ప్రస్తుతం బిజినెస్ అంటే చాలా మంది రిస్క్ అని భయపడుతుంటాంరు. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ తిరిగి వస్తుందోరాదో అని కంగారు పడుతుంటారు. అయితే సరైన ఆలోచనతో మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి వ్యాపారం మొదలు పెడితే.. ఎలాంటి నష్టాలు ఉండు. ప్రస్తుతం ఫుడ్‌కు సంబంధించిన బిజినెస్‌ ద్వారా మార్కెట్‌లో మంచి లాభాలను అర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా వంటింట్లో, రెస్టారెంట్లు, ఇతర తినుబండారాలలో వినియోగించే జామ్, జెల్లీ, మురబ్బా ఉత్పత్తికి భారీ మార్కెట్ డిమాండ్ ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా ప్రజలకు సహాయం చేస్తుంది. చిన్నస్థాయి పెట్టుబడితో ఎక్కువ లాభాలను అర్జించవచ్చు.

చిన్న లేదా పెద్ద స్థాయిలో జామ్, జెల్లీ, మురబ్బా వ్యాపారం మొదలుపెట్టవచ్చు. జామ్, జెల్లీ తయారీ ఈజీ. జామ్, జెల్లీని పండ్లు, చక్కెర, పెక్టిన్, ఇతర సంరక్షణకారులను ఉపయోగించి తయారు చేస్తారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) కింద ఆహార ఉత్పత్తుల రంగంలో వెంచర్లను ప్రారంభించే వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తోంది. జామ్, జెల్లీ, మురబ్బా తయారీ కోసం మీరు బ్యాంకుల నుంచి ముద్రలోన్ తీసుకోవచ్చు. ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) తయారు చేసిన జామ్, జెల్లీలు, మురబ్బా ప్రొడక్ట్‌లను ప్రారంభించేందుకు మొత్తం రూ.17.04 లక్షలు ఖర్చవుతుంది. అందులో మీరు రూ.1.70 లక్షలు ఇనెస్ట్‌మెంట్‌కు పోగా.. మిగిలిన డబ్బు బిల్డింగ్ షెడ్, పరికరాల కొనుగోళ్లు, ఫర్నీచర్‌లు, ఫిక్చర్‌లు మొదలైన వాటి కోసం కేటాయించాలి.

KVIC ప్రాజెక్ట్ ఖర్చు అంచనా ఇలా..

==> ల్యాండ్ బిల్డింగ్ & సివిల్ వర్క్ ప్లాంట్, మెషినరీ: రూ.8.26 లక్షలు

==> ఫర్నిచర్ & ఫిక్స్చర్స్: రూ.లక్ష

==> ముందస్తు ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరం: రూ.7.78 లక్షలు

==> మొత్తం = రూ 17.04 లక్షలు

==> మీ ఇన్వెస్ట్‌మెంట్: రూ.1.70 లక్షలు

==> బ్యాంక్ ఫైనాన్స్: రూ. 8.33 లక్షలు

==> బ్యాంకు నుంచి వర్కింగ్ క్యాపిటల్: రూ 7.00 లక్షలు

==> మొత్తం : రూ .17.04 లక్షలు

ఈ వ్యాపారంలో మొదటి ఏడాది రూ.66 లక్షలు, 2వ ఏడాది రూ. 79.65 లక్షలు, 3వ ఏడాది రూ.87.52 లక్షలు, 4వ ఏడాది రూ. 96.10 లక్షలు,  5వ సంవత్సరంలో రూ.104.88 లక్షల నికర విక్రయాలను ఆశించవచ్చరి KVIC నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదాయం కేవలం ఓ అవగాహన కోసమేనని.. స్థానాన్ని బట్టి తేడా ఉండవచ్చని కేవీఐసీ నివేదిక వెల్లడించింది. లాభాలు పెరిగే కొద్దీ క్యాపిటల్ ప్రాజెక్టుల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని పేర్కొంది.

మీ ప్రొడక్ట్‌కు ప్రత్యేకమైన రుచి, నాణ్యత ఉండి.. ఎక్కువగా మార్కెటింగ్ చేసుకుంటే విక్రయాలు లక్షల్లో ఉంటాయి. ఈ వ్యాపారంలో మీరు నెలకు దాదాపు రూ.40 వేల లాభాన్ని ఆర్జిస్తే.. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. 

(గమనిక: మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు మార్కెట్‌లో పూర్తి పరిశోధన చేయండి. ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.)

Also Read: Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి

Also Read: 7th Pay Commission: దీపావళికి రాష్ట్ర ప్రభుత్వాలు గిఫ్ట్.. ఏ రాష్ట్రం ఎంత జీతం పెంచిందంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News