Mukesh Ambani on Ratan Tata`s death:`రతన్, నువ్వు నా గుండెల్లో ఎప్పుడూ ఉంటావు.. ముఖేష్ అంబానీ ఎమోషనల్ ట్వీట్
Mukesh Ambani emotional over Ratan Tata`s death: రతన్ టాటా మరణవార్తతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. రతన్ టాటా తన గుండెల్లో ఎప్పుడూ ఉంటారని అన్నారు.
Mukesh Ambani emotional over Ratan Tata's death: భారతదేశం దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది. రతన్ టాటా ఇక మధ్య లేరు. ముంబైలోకి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. రతన్ టాటా మరణ వార్త యావత్ దేశ ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రతన్ టాటా మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ. రతన్ టాటా మరణం పట్ల ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేవారు. రతన్ టాటాను కోల్పోయినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణ వార్త దేశానికి తీరని లోటు అన్నారు. రతన్ నువ్వు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు అని అంబానీ ఎమోషనల్ అయ్యారు.
ఈరోజు మనదేశానికి చాలా విచారకరమైంది. రతన్ టాటా మరణం..టాటా గ్రూప్ నకే కాదు..ప్రతి భారతీయుడికి తీరని లోటు అన్నారు. రతన్ టాటా మరణం వ్యక్తిగతంగా తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈరోజు నేను నా ప్రియ స్నేహితుడిని కోల్పోయాను. ఆయన నాకు స్పూర్తిని, ఉత్తేజాన్ని ఇచ్చింది.
ఈ రోజు భారతదేశానికి చాలా విచారకరమైన రోజు అని ముఖేష్ అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు. రతన్ టాటా మృతి టాటా గ్రూప్‌కే కాకుండా ప్రతి భారతీయుడికి తీరని లోటు అని ఆయన అన్నారు. రతన్ టాటా మృతి వ్యక్తిగత స్థాయిలో ఆయనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన పాత్ర గొప్పతనం, ఆయన ప్రతిపాదిస్తున్న అద్భుతమైన మానవ సూత్రాలు నా గౌరవాన్ని పెంచాయి. రతన్ టాటా దూరదృష్టి గల పారిశ్రామికవేత్త పరోపకారి . ఆయన ఎల్లప్పుడూ సమాజం అభివృద్ధి కోసం పనిచేశారు.
'రతన్, నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు'
భారతదేశం తన అత్యంత తెలివైన వ్యక్తిని కోల్పోయిందని ముకేశ్ అంబానీ అన్నారు. రతన్ టాటా భారతదేశాన్ని ప్రపంచానికి అందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ వస్తువులను భారతదేశానికి తీసుకువచ్చారు. అతను టాటా కుటుంబాన్ని సంస్థాగతీకరించారు. దానిని అంతర్జాతీయ సంస్థగా చేసారు. 1991లో రతన్ టాటా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి టాటా గ్రూప్ 70 రెట్లు పెరిగింది. రిలయన్స్ కుటుంబం, అంబానీ కుటుంబం, టాటా కుటుంబ సభ్యులకు, టాటా గ్రూప్ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. రతన్, నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు... ఓం శాంతి అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు ముఖేశ్ అంబానీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.