RBI Repo Rate Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లకు పెంచింది. ఈ నిర్ణయంతో రెపో రేటు 4.4 శాతం నుంచి 4.90 శాతానికి చేరింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రెపో రేటు పెంపుకు కమిటీలోని ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు.ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరాలు వెల్లడించారు. గత నెలలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లకు పెంచిన ఆర్‌బీఐ తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరగనున్న ఈఎంఐల భారం:


ఆర్‌బీఐ రెపో రేటు పెంపుతో హౌసింగ్, వాహన, ఇతరత్రా రుణాలపై వడ్డీ భారం పెరుగుతుంది. రెపో రేటు పెరిగిందంటే సాధారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేస్తుంటాయి. దీంతో కొత్తగా రుణాలు తీసుకునేవారిపై అధిక భారం పడుతుంది. అలాగే, ఇప్పటికే రుణాలు పొంది ఈఎంఐలు చెల్లిస్తున్నవారిపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. బ్యాంకులు ఈఎంఐలపై నేరుగా వడ్డీ భారాన్ని మోపకపోయినా.. ఈఎంఐలు కట్టే నెలల సంఖ్య పెరగవచ్చు. ఒకరకంగా రెపో రేటు పెరగడమంటే రుణ గ్రహీతలకు ప్రతికూలాంశమే.


అసలేంటీ రెపో రేటు :


కమర్షియల్ బ్యాంకులు నిధుల కోసం ఆర్‌బీఐపై ఆధారడుతాయి.ఆర్‌బీఐ నుంచి నిధులు తీసుకున్నప్పుడు.. వాటిపై విధించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ రెపో రేటును ఒక అస్త్రంగా వాడుతుంది. రెపో రేటు పెంపుతో రుణాలకు డిమాండ్ తగ్గుతుంది. క్రెడిట్ కార్డుల వినియోగం, తనఖాలు వంటివి తగ్గిపోతాయి. తద్వాారా మార్కెట్లో వస్తువుల క్రయ విక్రయాలకు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గిందంటే ఆటోమేటిగ్గా ధరలు తగ్గుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది.


Also Read: Fact Check: ప్రభుత్వ యోజనా పథకం పేరుతో మీకూ ఈ మెసేజ్ వచ్చిందా.. అయితే బీ అలర్ట్..  


Also Read: Gayatri Jayanti 2022: గాయత్రీ మంత్రంలోని 24 రహస్య శక్తులు..వాటి ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు తెలుసా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి