Fact Check: ప్రభుత్వ యోజనా పథకం పేరుతో మీకూ ఈ మెసేజ్ వచ్చిందా.. అయితే బీ అలర్ట్..

Fact Check Over Govt Yojana Rs.2.67 Lakh : ప్రభుత్వ యోజనా పథకం కింద మీ బ్యాంకు ఖాతాలో రూ.2.67 లక్షలు జమ అయినట్లు మీ సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా... అయితే బీ అలర్ట్... 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 11:05 AM IST
  • ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్
  • సోషల్ మీడియాలో ప్రభుత్వ యోజనా పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్
  • బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు
  • ఇది పూర్తిగా ఫేక్ అని చెప్పిన పీఐబీ
Fact Check: ప్రభుత్వ యోజనా పథకం పేరుతో మీకూ ఈ మెసేజ్ వచ్చిందా.. అయితే బీ అలర్ట్..

Fact Check Over Govt Yojana Rs.2.67 Lakh : ఇటీవలి కాలంలో ఓ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో 'ప్రభుత్వ యోజనా' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.2,67,000 డిపాజిట్ చేస్తున్నట్లుగా పేర్కొనబడింది. దీనికి సంబంధించి కొంత మంది సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు కూడా వస్తున్నాయి.మీ ఖాతాలో ప్రభుత్వ యోజనా పథకం కింద రూ.2.67 లక్షలు జమయ్యాయని ఆ మెసేజ్‌లలో పేర్కొంటున్నారు. అయితే ఇందులో నిజమెంత... ప్రభుత్వం నిజంగానే ఈ స్కీమ్‌ను అమలుచేస్తోందా...

వైరల్ మెసేజ్‌లో నిజం ఏమిటి?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్‌ పూర్తిగా ఫేక్ అని ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. అలాంటి పథకాలేవీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయట్లేదని... ఆ మెసేజ్‌లకు కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. 

పొరపాటున లింక్‌పై క్లిక్ చేయవద్దు

ప్రభుత్వ యోజనా పథకం కింద రూ.2.67 లక్షలు జమ అయినట్లు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. అందులో ఒక లింక్ కూడా ఇస్తున్నారు. పొరపాటున కూడా ఈ లింక్‌పై క్లిక్ చేయవద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే మీరు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మెసేజ్‌లను విస్మరించండి.

ఇలాంటి మెసేజ్‌లు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి మెసేజ్‌లు వైరల్ అయ్యాయి. చాలామంది ఇది నిజమేనని నమ్మి అందులో ఉన్న లింకుపై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. ఆ లింకుపై క్లిక్ చేయడమే ఆలస్యం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి.అందుకే ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల పట్ల పీఐబీ ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్స్ పేరిట ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

Also Read: Ys Viveka Case: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..పులివెందులలో సీబీఐ మకాం అందుకేనా..!

Also Read: Minor Rape Victims: రెచ్చిపోతున్న కామాంధులు..బాలికలపై ఆగని దారుణాలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News