RBI Key Policy Rates: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ కీలక ప్రకటన.. వరుసగా తొమ్మిదోసారి యథాతథంగా వడ్డీ రేట్లు
RBI Key Policy Rates: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, ఆర్థిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో వడ్డీ రేట్లను యాథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
RBI Key Policy Rates: వడ్డీ రేట్లను వరుసగా 9వ సారి యథాతథంగా కొనసాగించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఇదే విషయాన్ని దేశంలోని పలు ఆర్థిక నిపుణుల తమ అంచనాలను ప్రకటించారు. వాటిని నిజం చేస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు.
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ జీడీపీ వృద్ధి రేటు 9.5గా ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. మూడో త్రైమాసికంలో 6.6శాతం, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో నికర జీడీపీ వృద్ధిరేటు 17.2 శాతంగా , రెండో క్వార్టర్లో 7.8 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
Also Read: Flipkart Sale: రూ.30 వేల కంటే తక్కువ ధరతో iPhone 12 మీ సొంతం చేసుకోండి!
Also Read: Motorola Moto G51 mobile: ఇండియాలో లాంచ్ అవుతున్న మోటోరోలా మోటో జి51 మొబైల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook