RBI MPC meet: కీలక వడ్డీ రేట్లు యథాతథం- ఇకపై అన్ని ఏటీఎంలలో కార్డ్‌లెస్ విత్‌డ్రా!
RBI MPC meet: మూడు రోజుల పాటు జరిగిన ఎంపీసీ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గరవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇందులో కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపారు. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి.
RBI MPC meet: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) నిర్వహించిన తొలి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఈ సారి కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రెపో రోటు 4 శాతం వద్ద కొనసాగుతోంది. రివర్స్ రెపో రేటును కూడా 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు వెల్లడించారు శక్తికాంతదాస్.
ఏమిటి ఈ ఎంపీసీ సమావేశం..
ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన కమిటీనే.. మానిటరీ పాలసీ కమిటీగా పిలుస్తుంటారు. ప్రతి రెండు నెలలకు ఓ సారి ఈ కమిటీ సమావేశమై దేశ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కీలక వడ్డీ రేట్ల మార్పు సహా వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇందులో భాగంగా ఈ నెల 6న ప్రారంభమైన ఎంపీసీ సమావేశం నేటి (ఏప్రిల్ 8) వరకు సాగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను, ఆర్థిక వ్యవస్థపై అంచనాలను గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు.
ఈ సారి భేటీలో నిర్ఱయాలు, అంచనాలు..
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవ్వచ్చు.
2022-23లో ద్వవ్యోల్బణం సగటున 5.7 శాతంగా ఉండొచ్చు
యూపీఐ ద్వారా ఇకపై అన్ని ఏటీఎంలు, బ్యాంకుల ద్వారా కార్డ్‌లెస్ విత్‌డ్రాలు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 1 నాటికి మన దేశ విదేశీ మారక విలువలు 606.5 బిలియన్ డాలర్లు.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.25 శాతంగా.
అన్ని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది ఆర్బీఐ.
Also read: Petrol Diesel Price Today: వాహనదారులకు గుడ్ న్యూస్- పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట!
Also read: What is TATA NEU: టాటా న్యూ యాప్‌తో ఎవరికి, ఎలాంటి ఉపయోగాలు.. పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook