RBI Rules: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా..
RBI New Rules: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన రూల్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. ఇక నుంచి సంబంధించిన బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా సులభతరం చేసింది. దీంతో కోట్లాది మంది ఖాతాదారులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. పూర్తి వివరాలు ఇలా..
RBI New Rules: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త. కోట్లాది మంది ఖాతాదారులపై నేరుగా ప్రభావం చూపే నిబంధనల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్పులు చేసింది. కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను రూపొందిస్తోంది. ఇప్పుడు ఆర్‌బీఐ సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన నిబంధనలను మార్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఇప్పటికే బ్యాంక్‌లో అన్ని పత్రాలు సమర్పించిన ఖాతాదారులు.. చిరునామాలో ఎలాంటి మార్పులు లేనట్లయితే కేవైసీ కోసం బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. కేవైసీ వివరాలలో ఏదైనా మార్పు ఉంటే.. ఖాతాదారులు తమ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. మీరు ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎం, ఇతర డిజిటల్ పద్ధతుల ద్వారా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది.
కేవైసీ వివరాలు మారని కస్టమర్లు.. వారి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి వారి నుంచి డిక్లరేషన్ లెటర్ ఇవ్వవలసి ఉంటుంది. దీని కోసం బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కస్టమర్ల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నామని, తద్వారా ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. కస్టమర్ల వివరాలు ఇతరులు ఎవరికీ అందకుండా అప్‌డేట్ అవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు బ్యాంక్ ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది.
దేశంలోని ఏ బ్యాంకు నుంచి మీకు కాల్ వచ్చిన మీ వ్యక్తిగత వివరాలను పంచుకోద్దు. ముఖ్యంగా ఆధార్, పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కేటుగాళ్లు ఫోన్లు చేస్తూ.. అమాయకులను దోచుకుంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీని ఎట్టిపరిస్థితుల్లోనే చెప్పవద్దు. అదేవిధంగా గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేయకండి. అప్రమత్తంగా ఉండండి.. సైబర్ మోసాలకు దూరంగా ఉండండి.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం..!
Also Read: Income Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఏ స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ పే చేయాలంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి