Realme GT 2 Pro: మార్కెట్లోకి రియల్మీ జీటీ 2 ప్రో- ఫీచర్లతో పాటు ఆఫర్లూ అదుర్స్
Realme GT 2 Pro: దేశీయ మార్కెట్లోకి ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది రియల్మీ. రియల్మీ జీటీ 2 ప్రో పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
Realme GT 2 Pro: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ దేశీయ మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ను ఆవిష్కరించరింది. రియల్మీ జీటీ 2 ప్రో పేరుతో నేడు మార్కట్లోకి ఈ కొత్త మోడల్‌ను విడుదల చేసింది. రియల్మీ జీటీ సిరీస్‌కు కొనసాగింపుగా ఈ మోడల్‌ను విడుదల చేసింది.
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022లో ఈ మోడల్‌ను ప్రదర్శించింది రియల్మీ. కాగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో గత నెలలో విడుదలై.. చైనాలో విక్రయాలు కూడా జరుగుతున్నాయి.
ఫోన్ ధర ఎంతంటే?
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రకాల స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవనుంది. ఇందులో 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.44,999గా నిర్ణయించింది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.52,999గా వెల్లడించింది కంపెనీ.
ఏప్రిల్ 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ఫోన్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రియల్మీ అధికారిక వెబ్సైట్ సహా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనుగోలు చేసే వీలుంది.
ప్రారంభ ఆఫర్ కింద భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది కంపెనీ. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే తక్షణం రూ.5000 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చని ప్రకటించింది. ఈఎంఐ లావాదేవీలకూ ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది.
రియల్మీ జీటీ 2 ప్రో ఫీచర్లు..
6.67 అంగుళాల ఆమోల్డ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
క్వాల్కమ్ శ్నాప్డ్రాగన్ 8 జెన్ 1
వెనకవైపు మూడు కెమెరాలు (50 ఎంపీ+50 ఎంపీ+2 ఎంపీ)
32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 33 వాట్స్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Also read: Zuck Bucks: మెటా నుంచి డిజిటల్ కరెన్సీ.. 'జుక్ బక్స్' పేరుతో..?
Also read: Stock Markets: మూడో రోజూ మార్కెట్ల బేజారు.. సెన్సెక్స్ 575 పాయింట్లు డౌన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook