Zuck Bucks: మెటా నుంచి డిజిటల్​ కరెన్సీ.. 'జుక్​ బక్స్' పేరుతో..?

Zuck Bucks: ఫేస్​బుక్​ డిజిటల్​ కరెన్సీ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి ఎలాగైనా డిజిటల్​ కరెన్సీని అందుబాటులోకి తెచ్చేలా ఫేస్​బుక్​ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరో విశేషమేమిటంటే.. మార్క్ జుకర్​ బర్గ్ పేరుపైనే ఈ డిజిటల్ కరెన్సీ రానుందట!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 04:15 PM IST
  • మరోసారి తెరపైకి ఫేస్​బుక్ డిజిటల్ కరెన్సీ
  • మార్క్ జుకర్​బర్గ్​ పేరుతో తెచ్చేందుకు కసరత్తు!
  • త్వరలోనే అధికారిక ప్రకటనకు అవకాశం!
Zuck Bucks: మెటా నుంచి డిజిటల్​ కరెన్సీ.. 'జుక్​ బక్స్' పేరుతో..?

Zuck Bucks: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​ మాతృసంస్థ 'మెటా' తమ సొంత డిజిటల్ కరెన్సీపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ డిజిటల్​ కరెన్సీని ఫేస్​బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్​బర్గ్​ పేరుమీద తీసుకురానున్నట్లు సమాచారం. 'జూక్​ బక్స్​' పేరుతో ఈ డిజిటల్​ కరెన్సీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మెటాగా ఫేస్​బుక్ రీబ్రాండ్ అవకముందు.. లిబ్రా పేరుతో క్రిప్టో కరెన్సీపై కసరత్తు చేసింది. ఈ ప్రాజెక్టులో వివిధ దిగ్గజ సంస్థలు కూడా భాగస్వామ్యమయ్యాయి. అయితే వివిధ నియంత్రణ సంస్థల, దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో కంపెనీలు ఈ ప్రాజెక్ట్​ నుంచి తప్పుకున్నాయి. మెటాగా రీబ్రాండింగ్ అయిన తర్వాత కూడా డియమ్​ పేరుతో డిజిటల్​ కరెన్సీ ప్రాజెక్ట్​ను ప్రారంభించింది అయినప్పటికీ.. ఆ ప్రాజెక్టు కూడా మందుకు సాగలేదు.

నియంత్రణ సంస్థలు, వివిధ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న డిజిటల్ కరెన్సీపై ఫేస్​బుక్ అధినేత మార్క్ జుకర్​బర్గ్​ దానిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెటావర్స్​లో ఈ-కామర్స్​, ఫినాన్షియల్​ టూల్స్​ ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు విశ్లేషిస్తునే ఉన్నారు. ఇందులో భాగంగానే మరోసారి 'జూక్​ బక్స్​' పేరుతో డిజిటల్​ కరెన్సీ తీసుకురావని నిర్ణయించినట్లు సమాచారం.

మెటావర్స్​లో గేమింగ్స్​ వంటి అవసరాలకు దీనిని ముందుగా వినియోగించాలని మెటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ విజయవంతమైతే ఇతర అవసరాలకు ఈ కరెన్సీని ఉపయోగించొచ్చని సమాచారం. అయితే ఈ కొత్త కరెన్సీకి సంబంధించిన  మెటా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also read: Stock Markets: మూడో రోజూ మార్కెట్ల బేజారు.. సెన్సెక్స్ 575 పాయింట్లు డౌన్​

Also read: Google New Feature: టోల్ గేట్స్ పై అదిరే ఫీచర్‌ ప్రవేశపెట్టిన గూగుల్ మ్యాప్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News