World's Best Employer rankings 2021: 2021 ఏడాదికి గాను ఫో‍ర్బ్స్‌ సంస్థ ప్రకటించిన వరల్డ్ బెస్ట్‌ ఎంప్లాయర్‌ ర్యాంకింగ్స్‌(World's Best Employer rankings 2021)లో రిలయన్స్(Reliance Industries) 52వ స్థానం దక్కించుకోగా... భారతీయ కార్పొరేట్లలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకులను పరిశీలిస్తే శామ్‌సంగ్‌(SamSung) సంస్థ ప్రథమ స్థానంలో నిలవగా ఐబీఎం(IBM Computers) కంప్యూటర్స్‌ ద్వితీయ స్థానం దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, డెల్‌, హువావేలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాప్‌ 100లో ఆ నాలుగు సంస్థలే
ఫోర్బ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్‌ అవార్డులకు సంబంధించి టాప్‌ 100 జాబితాలో భారత్ తరుపున మొత్తం నాలుగు సంస్థలకే చోటు దక్కింది. అందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 52వ స్థానంలో నిలవగా ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI Bank) 65వ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 77, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 90 ర్యాంకును దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక ఎస్‌బీఐ 117వ, ఎల్‌ అండ్‌ టీ 127వ స్థానాలకే పరిమితం అయ్యాయి.


Also read: stock market: జోరుమీదున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..61 వేలు క్రాస్‌ చేసిన సెన్సెక్స్‌!


జాబితా ఎలా రూపొందించిందంటే..
ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాలకు చెందిన 750 కంపెనీల నుంచి 1,50,000ల మంది ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించి ఫోర్బ్స్‌(Forbes) ఈ జాబితాను రూపొందించింది. ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కంపెనీ ఆర్థిక ప్రణాళిక, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత, టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ తదితర అంశాలపై వివరాలు సేకరించారు.


ఇతర ఇండియన్‌ కంపెనీలు
ఫోర్బ్స్‌ బెస్ట్‌ఎంప్లాయర్‌ ర్యాకింగ్స్‌లో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ కంపెనీల విషయానికి వస్తే బజాజ్‌ 215, యాక్సిస్‌ బ్యాంక్‌ 215, ఇండియన్‌ బ్యాంక్‌ 314, ఓన్‌ఎన్‌జీసీ 404, అమర్‌రాజా గ్రూపు 405,  కోటక్‌ మహీంద్రా 415, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 496, ఎల్‌ఐసీ 504, ఇన్ఫోసిస్‌ 588, టాటా గ్రూపు 746వ స్థానాలు దక్కించుకున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook