RIL, Saudi Aramco have mutually decided to re-evaluate a major investment proposal: చమురు వ్యాపార రంగంలో ఓ భారీ డీల్​గా నిలిచిపోతుందనుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్​- సౌదీ ఆరామ్​కో డీల్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ డీల్​పై ఇరు సంస్థలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌదీ ఆరామ్​కో రిలయన్స్ ఆయిల్​ టూ కెమిటకల్ (ఓ2సీ) వ్యాపారాల్లో (RIL O2C business) పెట్టుబడులను ఓ సారి పునఃపరిశీలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఇరు కంపెనీలు భావిస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.


ఇరు సంస్థల మధ్య డీల్​ ప్రణాళిక ఇలా..


రిలయన్స్ ఓ2సీ వ్యాపారాల్లో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్​కోకు విక్రయించాలని రిలయన్స్ భావించింది. దీని ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా (RIL aramco deal value) పెట్టుకుంది. సౌదీ ఆరామ్​కో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్ధగా వెలుగొందుతోంది.


ఈ డీల్​పై 2019లోనే ప్రకటన చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ​. 2020 మొదటి అర్ధభాగంలో డీల్​ పూర్తి చేయాలని భావించింది కంపెనీ. అయితే కరోనా కారణంగా ఇది సాధ్యం కాలేదు.  ఆ తర్వాత ఈ డీల్​లో జాప్యం జరుగుతూ వచ్చింది.


Also read: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు


Also read: వావ్: గూగుల్‌ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్


డీల్​ వెనుక కారణాలు..


నిజానికి రిలయన్స్​ ఇండస్ట్రీస్​ రుణ రహితంగా మారేందుకు గానూ.. ఈ డీల్​ చేసుకోవాలని భావించింది. అయితే కరోనా కారణంగా ఇది సాధ్యం కాకపోవడంతో.. రైట్లు ఇష్యూ సహా ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకుంది కంపెనీ. దీనితో గడువుకన్నా ముందే కంపెనీ రుణ రహితంగా మారింది. ఆరామ్​కో డీల్ పూర్తవకుండానే దీనిని సాధించడం గమనార్హం.


కాగా ఈ డీల్​ కోసం ఇప్పటికే రిలయన్స్ గ్రూప్​ నుంచి ఓ2సీ వ్యాపారాలను విడదీసి ప్రత్యేక సంస్థగా మారిచింది రిలయన్స్. దీనర్ధం రిలయన్స్ గ్రూప్​లో జియో, రిటైల్ వ్యాపారాల్లానే.. చమురు వ్యాపారాలు కూడా ప్రత్యేక సంస్థగా వ్యవహరిస్తోంది.


Also read: త్వరలో పన్ను పరిధిలోకి 'క్రిప్టో' ఆదాయం- బడ్జెట్​లో చట్ట సవరణ!


Also read: కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు, వాటి ఫీచర్స్, ధరలు, కెమెరా సెటప్ డీటేల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook