త్వరలో పన్ను పరిధిలోకి 'క్రిప్టో' ఆదాయం- బడ్జెట్​లో చట్ట సవరణ!

Cryptocurrency: క్రిప్టో కరెన్సీల ద్వారా  గడించే ఆదాయం పన్ను పరిధిలోకి రానుందా? అంటే అవుననే సమధానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు కీలక వివరాలు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 05:36 PM IST
  • క్రిప్టో ఆదాయంపై పన్ను విధించే యోచనలో కేంద్రం!
  • బడ్జెట్​లో చట్ట సవరణ చేసే అవకాశం
  • కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం
త్వరలో పన్ను పరిధిలోకి 'క్రిప్టో' ఆదాయం- బడ్జెట్​లో చట్ట సవరణ!

Government to bring cryptocurrencies under the tax net: క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తుచేస్తున్నట్లు సమాచారం. 2022-23 బడ్జెట్ బిల్లులో ఈ అంశాన్ని (Cryptocurrencies bill in Budget) కూడా చేర్చే అవకాశలున్నాయని ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు.

ఆదాయపు పన్ను పరంగా ఇప్పటికే కొంత మంది.. క్రిప్టో కరెన్సీలో మూలధనంపై పన్నులు చెల్లిస్తున్నట్లు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్​ బజాజ్ (Tarun Bajaj on Cryptocurrency) తెలిపతారు. దీనికి జీఎస్​టీ వర్తిస్తుందని చట్టాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు.

'ప్రస్తుతం క్రిప్టో కరెన్సీవినియోగం పెరిగిపోయింది. చట్టాల్లో మార్పులు (Changes in Income tax rules) తీసుకురాగలమా అనేది చూడాలి. ఇది  బడ్జెట్​లో భాగమే. ప్రస్తుతం మనం బడ్జెట్​కు దగ్గర ఉన్నాం. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం.' అని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు.

Also read: వావ్: గూగుల్‌ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్

Also read: ఆ క్రెడిట్‌ కార్డులను బ్యాన్ చేస్తోన్న అమెజాన్‌

ఏమిటి ఈ క్రిప్టో కరెన్సీ..

క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్​ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ కోడ్​ల ద్వారా పని (What is Cryptocurrency) చేస్తుంటాయి. మనం సాధారణంగా చూసే కరెన్సీలను భౌతికంగా చూడగలం, ముట్టుకోగలం. అయితే క్రిప్టో కరెన్సీని సాఫ్ట్​వేర్​తో రూపొందించి కరెన్సీ. కాబట్టి వీటిని భౌతికంగా చూడలేం, ముట్టుకోలేం.

పేరుకు తగ్గట్లుగానే.. క్రిప్టోగ్రఫీ, బ్లాక్​ చైన్​ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు. బ్లాక్​ చైన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తున్నందున క్రిప్టో కరెన్సీల లావాదేవీలను సురక్షితంగా జరుగుతంటాయి.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. వీటిపై ఏ దేశానికి నియంత్రణ లేదు. అందుకే.. వీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతుంటాయి.

ప్రస్తుతం మార్కెట్లో.. బిట్​కాయిన్ (Bitcoin)​, ఇథేరియం, స్టెల్లార్, రిపుల్, డాష్​​ కాయిన్లు బాగా పాపులర్​.

Also read: డెబిట్, క్రెడిట్ కార్డులపై ఉండే సివివి అర్థం ఏంటి ? సివివితో హ్యాకర్స్ మోసం చేయలేరా ?

గతంలో బ్యాన్​ కానీ..

నియంత్రణ లేదనే కారణంతో క్రిప్టో కరెన్సీల వినియోగంపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) గతంలో నిషేధం (RBI Ban Cryptocurrency) విధించింది. అయితే దీనికి వ్యతిరేకంగా ఓ సామాజిక కార్యకర్త వేటిసి పిటిషన్​పై విచారణ జరిపిన సూప్రీం కోర్టు.. 2020 మార్చులో ఆర్​బీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీనితో దేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగం మళ్లి అధికారికమైంది.

క్రిప్టో కరెన్సీ వ్యాపారం ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. వివిధ యాప్​లు బిట్​కాయిన్ ట్రేడింగ్​ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పలు దిగ్గజ సంస్థలు బిట్​కాయిన్ ద్వారా లావాదేవీలకు అనుమతినిస్తున్నాయి.

Also read: బంగారం కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Also read: డౌన్​లోడ్​ స్పీడ్​లో జియో అగ్రస్థానం- అప్లోడ్​లో వొడాఫోన్ ఐడియా జోరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News