Jio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితం
Jio Best Recharge plans: ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్ అందిస్తోంది. రీఛార్జ్ ప్లాన్లతో పాటు ఓటీటీ సేవలు ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం.
Jio Best Recharge plans: దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలికం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. జూలైలో రీఛార్జ్ టారిఫ్ పెంచిన తరువాత చాలామంది ఇతర నెట్‌వర్క్‌కు మారుతుండటంతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొస్తోంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
కస్టమర్లు చేజారకుండా ఉండేందుకు రిలయన్స్ జియో కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించనుందని ప్రకటించింది. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌పై ఈ అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా జియో 3999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. 5 జి నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో అయితే అన్‌లిమిటెడ్ 5జి సేవలు పొందవచ్చు. మొత్తం 365 రోజులకు 912.5 జీబీ డేటా లభిస్తుంది. ఇక జియో సినిమా ఓటీటీ సేవలు ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు జియో టీవీ, జియో క్లౌడ్ కూడా ఉంటాయి.
జియో 949 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్ 5జి సేవలు పొందవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు అదనంగా లభిస్తాయి.
జియో 1029 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో కూడా రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటాయి. 5జి నెట్‌వర్క్ సేవలు లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.
జియో 1049 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. అన్‌లిమిటెడ్ 5జి నెట్‌వర్క్ సేవలు పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు అదనంగా లభిస్తాయి.. వీటన్నింటితో పాటు సోనీ లివ్, జీ5 సేవలు ఉచితంగా పొందవచ్చు.
రిలయన్స్ జియో 1299 రూపాయల రీఛార్జ్ ప్లాన్ 84 రోజు వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటాయి. అన్‌లిమిటెడ్ 5జి నెట్‌వర్క్ పొందవచ్చు.. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు అదనంగా లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఉచితంగా పొందవచ్చు.
Also read: Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook