Reliance Jio Introduces Rs 1 Prepaid Plan with 30days validity: రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ఏ టెలికాం నెట్‌వర్క్‌ ఇవ్వని ఆఫర్ జియో ఇస్తోంది. అత్యంత చౌకైన ప్లాన్ తీసుకొచ్చింది జియో. ఒక్క రూపాయి ప్లాన్‌ను జియో కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌ ఇప్పటికే వాల్యూ కేటగిరీలో యాడ్‌ అయ్యింది. ప్రీపెయిడ్‌ రీఛార్జిలో భాగంగా రూ.1కి వంద ఎంబీ 4జీ డేటా అందిస్తోంది జియో. దీనికి 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఈ డేటా అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ వినియోగించుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రూ. 1 ప్లాన్ మై జియో యాప్‌లో (My Jio app) అందుబాటులో ఉంది. వెబ్‌లో ఈ ప్లాన్ కనిపించదు. జియో కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 1 ప్లాన్‌తో (Jio Rs 1 Recharge Plan) పలు ప్రయోజనాలు ఉన్నాయి. సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా ఉత్తమం. ఈ ప్లాన్‌లో కాలింగ్, SMS సౌకర్యం లేదు. రూ.1 ప్లాన్‌కు.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా 100MB డేటా (100MB data) పొందొచ్చు. డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 60kbpsకి పడిపోతుంది.


Also Read : Valimai Making: బైక్‌పై నుంచి జారిపడిపోయిన స్టార్ హీరో.. అయినా కూడా!!


భారతదేశంలో చౌకైన ప్లాన్


జియో రూ.1 ప్లాన్ ప్రస్తుతం మనదేశంలో అతి చౌకైన ప్లాన్‌. జియో కాకుండా ఇతర ఏ టెలికాం కంపెనీ కూడా రూ.1 ప్లాన్‌ను ప్రస్తుతం అందిచడం లేదు.


ఇక జియోలో (Jio) రూ.10, రూ.20 ప్లాన్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ. 10 ప్లాన్‌ ద్వారా రూ. 7.47 టాక్ టైమ్ అన్‌లిమిటెడ్ వ్యాలిడిటీతో లభిస్తుంది. రూ.20 ప్లాన్‌లో రూ.14.95 టాక్ టైమ్ అపరిమిత వ్యాలిడిటీతో లభిస్తుంది.


Also Read : Varun Singh's death news: హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో గాయపడిన వరుణ్ సింగ్ మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook